Telugu Global
MOVIE UPDATES

విక్రమ్ కు పడిపోయిన మహేష్ బాబు

కుటుంబంతో కలిసి యూరోప్ పర్యటన ముగించుకొని, ఇండియాకు తిరిగొచ్చిన మహేష్, వచ్చిన వెంటనే చేసి పనేంటో తెలుసా? ఆయన విక్రమ్ సినిమా చూశాడు. ప్రపంచవ్యాప్తంగా హిట్టయిన ఈ సినిమాను టూర్ లో ఉండడం వల్ల చూడలేకపోయాడు మహేష్. ఎట్టకేలకు ఆ సినిమాను వీక్షించిన సూపర్ స్టార్, యూనిట్ ను ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. “కమల్ నటించిన విక్రమ్ మూవీ చూశాను, నిజంగా ఈ న్యూ ఏజ్ థ్రిల్లర్ మూవీ అదిరిపోయింది. సినిమా చూసిన తర్వాత దర్శకుడు లోకేష్ కనకరాజ్ […]

vikram-day-1-collections
X

కుటుంబంతో కలిసి యూరోప్ పర్యటన ముగించుకొని, ఇండియాకు తిరిగొచ్చిన మహేష్, వచ్చిన వెంటనే చేసి పనేంటో తెలుసా? ఆయన విక్రమ్ సినిమా చూశాడు. ప్రపంచవ్యాప్తంగా హిట్టయిన ఈ సినిమాను టూర్ లో ఉండడం వల్ల చూడలేకపోయాడు మహేష్. ఎట్టకేలకు ఆ సినిమాను వీక్షించిన సూపర్ స్టార్, యూనిట్ ను ప్రశంసించకుండా ఉండలేకపోయాడు.

“కమల్ నటించిన విక్రమ్ మూవీ చూశాను, నిజంగా ఈ న్యూ ఏజ్ థ్రిల్లర్ మూవీ అదిరిపోయింది. సినిమా చూసిన తర్వాత దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో ఈ థ్రిల్లింగ్ మూవీ గురించి ఒకసారి కలిసి మాట్లాడాలనిపించింది. కీలక పాత్రలు చేసిన విజయ్ సేతుపతి, ఫాహద్ ఇద్దరూ కూడా తమ పాత్రలతో అదరగొట్టారు. అనిరుద్ మ్యూజిక్ అయితే అదిరింది. ఇక ఫైనల్ గా లెజెండ్ కమల్ హాసన్ యాక్టింగ్ గురించి చెప్పేంత స్థాయి నాకు లేదు, ఆయనకు పెద్ద అభిమానిగా మరొక్కసారి స్క్రీన్ పై ఆయన్ను చూసి ఎంజాయ్ చేశాను, ఇది నిజంగా నాకు ఒక ప్రౌడ్ మూమెంట్.”

ఇలా విక్రమ్ సినిమాపై పొగడ్తలు కురిపించాడు మహేష్ బాబు. కమల్ హాసన్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఇక చివర్లో రోలెక్స్ పాత్రలో సూర్య మెరిపించడంతో అందరికీ ఓ స్వీట్ షాక్ ఇచ్చినట్టయింది.

First Published:  3 July 2022 6:01 AM GMT
Next Story