Telugu Global
MOVIE UPDATES

ఎఫ్3 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

థియేటర్లలో నవ్వులు పూయించిన ఎఫ్3 సినిమా. ఇప్పుడు ఓటీటీని నవ్వులతో ముంచెత్తడానికి రెడీ అయింది. తాజాగా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ విడుదల కోసం పరుగులు పెడుతోంది. వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ఈనెల 22న ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన భారీ బడ్జెట్ కామెడీ ఎంటర్ టైనర్ ఎఫ్3. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కంటే, రెమ్యూనరేషన్లే […]

ఎఫ్3 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
X

థియేటర్లలో నవ్వులు పూయించిన ఎఫ్3 సినిమా. ఇప్పుడు ఓటీటీని నవ్వులతో ముంచెత్తడానికి రెడీ అయింది. తాజాగా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ విడుదల కోసం పరుగులు పెడుతోంది. వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ఈనెల 22న ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన భారీ బడ్జెట్ కామెడీ ఎంటర్ టైనర్ ఎఫ్3. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కంటే, రెమ్యూనరేషన్లే ఎక్కువయ్యాయి. అంతమంది ఆర్టిస్టులున్నారు ఈ సినిమాలో. కానీ బిజినెస్ మాత్రం బాగా చేసింది. మరీ ముఖ్యంగా నాన్-థియేట్రికల్ అదరగొట్టింది.

ఎఫ్3 సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్ ను సోనీ లివ్ దక్కించుకుంది. ఇప్పుడా ఓటీటీ వేదికగానే జులై 22న ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ సినిమా డీల్ అయినప్పుడు ఈ రెండు వేర్వేరు సంస్థలు. కానీ జీ తెలుగు, సోనీ కలిసిపోయాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ సినిమా జీ5 యాప్ లో ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సినిమాలో వెంకీ సరసన తమన్న, వరుణ్ సరసన మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో కనిపించగా, పూజాహెగ్డే ఐటెంసాంగ్ చేసింది. సునీల్, రఘుబాబు కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

First Published:  3 July 2022 7:01 AM GMT
Next Story