Telugu Global
NEWS

టీఆర్ఎస్‌కు ఝలక్ ఇవ్వనున్న కాంగ్రెస్ వలస నాయకులు?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వలసల హడావిడి మొదలైంది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన చాలా మంది నాయకులు తిరిగి సొంత గూటికి చేరాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్న ఈ నాయకులు కారు దిగి.. గాంధీభవన్ బాట పట్టనున్నారు. ఆరుగురు కార్పొరేటర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత టీఆర్ఎస్ పార్టీని వీడనున్నారు. భర్త నర్సింహారెడ్డితో కలసి ఆమె […]

టీఆర్ఎస్‌కు ఝలక్ ఇవ్వనున్న కాంగ్రెస్ వలస నాయకులు?
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వలసల హడావిడి మొదలైంది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన చాలా మంది నాయకులు తిరిగి సొంత గూటికి చేరాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్న ఈ నాయకులు కారు దిగి.. గాంధీభవన్ బాట పట్టనున్నారు. ఆరుగురు కార్పొరేటర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత టీఆర్ఎస్ పార్టీని వీడనున్నారు. భర్త నర్సింహారెడ్డితో కలసి ఆమె కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నట్లు ఇప్పటికే అనుచరులకు చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కూడా మంతనాలు జరిగాయని.. త్వరలోనే వీళ్లు హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తోంది. వీరిద్దరూ మరో ఆరుగురు కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని రానున్నట్లు సమాచారం.

అందరూ ఓకేరోజు కాంగ్రెస్‌లో చేరి కారు పార్టీకి ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. బడంగ్‌పేటలో టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి పెరిగిపోయిందని.. అందుకే వీళ్లు కాంగ్రెస్‌లో చేరుతున్నారని స్థానిక కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత, చిగురింత నర్సింహారెడ్డి, 23వ డివిజన్ కార్పొరేటర్ రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డిలను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శనివారం ప్రకటించారు. వీళ్లు పార్టీకి నష్టం చేకూరేలా వ్యవహరిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

మహేశ్వరం నియోజకవర్గం నుంచి గతంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నారు. అక్కడ కాంగ్రెస్ తరపున గెలిచిన సబితా ఇంద్రారెడ్డి తర్వాత టీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. దీంతో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని కృష్ణారెడ్డి భావిస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. విషయం తెలిసి కేటీఆర్ వ్యక్తిగతంగా కృష్ణారెడ్డిని కలిసి బుజ్జగించినట్లు తెలుస్తున్నది.

First Published:  2 July 2022 11:23 PM GMT
Next Story