Telugu Global
MOVIE UPDATES

మరోసారి ఐటెంగర్ల్ గా మారిన అంజలి

హీరోయిన్ అంజలికి ఐటెంసాంగ్స్ కొత్త కాదు. ఓవైపు మంచి పాత్రలు పోషిస్తూనే, మరోవైపు ఐటెంసాంగ్స్ చేసింది ఈ బ్యూటీ. సరైనోడు సినిమాలో ఆమె చేసిన ఐటెంసాంగ్ ఇప్పటికీ హిట్టే. ఈ క్రమంలో మరో ఐటెంసాంగ్ చేసింది అంజలి. మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ ఉంది. ఈ విషయాన్ని యూనిట్ స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, ఐటెంసాంగ్ లో డాన్స్ చేస్తున్న అంజలి ఫొటోను కూడా రిలీజ్ చేసింది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో […]

మరోసారి ఐటెంగర్ల్ గా మారిన అంజలి
X

హీరోయిన్ అంజలికి ఐటెంసాంగ్స్ కొత్త కాదు. ఓవైపు మంచి పాత్రలు పోషిస్తూనే, మరోవైపు ఐటెంసాంగ్స్ చేసింది ఈ బ్యూటీ. సరైనోడు సినిమాలో ఆమె చేసిన ఐటెంసాంగ్ ఇప్పటికీ హిట్టే. ఈ క్రమంలో మరో ఐటెంసాంగ్ చేసింది అంజలి. మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ ఉంది.

ఈ విషయాన్ని యూనిట్ స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, ఐటెంసాంగ్ లో డాన్స్ చేస్తున్న అంజలి ఫొటోను కూడా రిలీజ్ చేసింది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. కృతి శెట్టి, క్యాథరీన్ హీరోయిన్లు కాగా.. ఇప్పుడు మూడో హీరోయిన్ గా అంజలి కూడా చేరిపోయింది.

ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ను ఆగస్ట్ 12న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రచారం స్టార్ట్ అయింది. నితిన్ లుక్, కృతి షెట్టి లుక్స్ బయటకొచ్చాయి. ఇప్పుడు ఐటెంసాంగ్ లిరికల్ వీడియో కూడా రాబోతోంది.

First Published:  3 July 2022 2:25 AM GMT
Next Story