Telugu Global
National

కన్హయ్య హత్యకు 26/11 కి ఏంటి సంబంధం..?

2008 నవంబర్ 26న జరిగిన ముంబై దాడులను 26/11 అటాక్స్ అంటుంటారు. ఆ పేరుతో సినిమాలు కూడా వచ్చాయంటే 26/11 అనేది ఎంత భయానకమైన గుర్తుగా మిగిలిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ 26/11 కి కన్హయ్య హత్యకు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే కన్హయ్యను హత్య చేసిన అనంతరం నిందితులు పారిపోయిన బైక్ నెంబర్ 2611. ఆ బైక్ నెంబర్ ప్లేట్ పై RJ 27 AS 2611 […]

కన్హయ్య హత్యకు 26/11 కి ఏంటి సంబంధం..?
X

2008 నవంబర్ 26న జరిగిన ముంబై దాడులను 26/11 అటాక్స్ అంటుంటారు. ఆ పేరుతో సినిమాలు కూడా వచ్చాయంటే 26/11 అనేది ఎంత భయానకమైన గుర్తుగా మిగిలిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ 26/11 కి కన్హయ్య హత్యకు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే కన్హయ్యను హత్య చేసిన అనంతరం నిందితులు పారిపోయిన బైక్ నెంబర్ 2611. ఆ బైక్ నెంబర్ ప్లేట్ పై RJ 27 AS 2611 అనే నెంబర్ రాసి ఉంది. ఇది నిందితుల్లో ఒకరైన రియాజ్ అఖ్తరీకి చెందిన బైక్. అతనితోపాటు గౌస్ మహ్మద్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ ని స్వాధీనం చేసుకున్నారు. 2013లో అఖ్తరీ ఈ బైక్ ని కొన్నట్టుగా తెలుస్తోంది. 2611 అనే నెంబర్ కోసం 5వేలు ఖర్చు చేసినట్టు ఆధారాలున్నాయి. అంటే రియాజ్ కి 26/11 పేలుళ్లతో సంబంధం ఉందా.. అప్పటి గొడవల్లో అతను కీలకంగా వ్యవహరించాడా అనే అనుమానం పోలీసులకు వచ్చింది. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.

ఐసిస్ తరహా హత్య..
హత్యకు గురైన కన్హయ్య లాల్‌ శరీరంపై 26 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఇది ఐసిస్ తరహా హత్య అని ఓ మాజీ ఐపీఎస్ అధికారి చెబుతున్నట్టు తెలుస్తోంది. అంత క్రూరంగా కన్హయ్యను హతమార్చారు వారిద్దరూ. ఇక నిందితుల్లో ఒకడైన రియాజ్ అఖ్తరీ పాకిస్తాన్ కు పలుమార్లు ఫోన్ కాల్ చేసినట్టు అతడి మొబైల్ ని స్వాధీనం చేసుకున్నాక తెలిసింది. 2014లో అతడు ఓసారి నేపాల్ వెళ్లొచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ హత్యకోసం ముందుగానే రెక్కీ చేసినట్టు కూడా అనుమానిస్తున్నారు.

మరో ఇద్దరు అరెస్ట్..
ఈ హత్య విషయంలో నిందితులిద్దరికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కన్హయ్యను చంపేందుకు పన్నిన కుట్రలో వారు కూడా భాగస్వాములని, కన్హయ్య టైలర్ షాపు వద్ద గతంలో వారు రెక్కీ కూడా నిర్వహించారని తెలిపారు. అరెస్టయినవారు మొహ్సిన్‌, ఆసిఫ్‌ గా పేర్కొన్నారు. కన్హయ్య హత్య కేసు డైరీని పోలీసులు ఎన్‌ఐఏకు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ఐఏ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోంది. ప్రధాన నిందితులైన రియాజ్‌ అఖ్తరీ, గౌస్‌ మహమ్మద్‌ లను అజ్మేర్ లోని హైసెక్యూరిటీ జైలుకు తరలించారు.

First Published:  1 July 2022 9:41 PM GMT
Next Story