Telugu Global
MOVIE UPDATES

ఫస్ట్ లుక్: బోల్డ్ లుక్ లో ఫ్యాన్స్ కి షాకిచ్చిన దేవరకొండ..!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరి కనెక్ట్స్ తోపాటు కరణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా […]

ఫస్ట్ లుక్: బోల్డ్ లుక్ లో ఫ్యాన్స్ కి షాకిచ్చిన దేవరకొండ..!
X

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరి కనెక్ట్స్ తోపాటు కరణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలు పెంచింది.

కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ న్యూడ్ గా కనిపిస్తున్నాడు. ఇన్నర్ పార్ట్స్ కనిపించకుండా ఒక పూల గుత్తి మాత్రం పట్టుకున్నాడు. ఈ పోస్టర్ అలా విడుదల అయిందో లేదో ఇలా వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ ఇలాంటి బోల్డ్ లుక్ లో కనిపిస్తాడని ఫ్యాన్స్ అస్సలు ఊహించలేదు.లైగర్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి షాక్ అవుతున్నారు.

కాగా, విజయ్ బాక్సర్ గా కనిపించేందుకు పడ్డ కష్టం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. కండలు తిరిగిన దేహంతో విజయ్ ఇందులో కనిపిస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ మూవీ ఆగస్టులో విడుదల కానుంది. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడు. కాగా, గతంలో అమీర్ ఖాన్ పీకే సినిమాలో శరీరంపై ఎటువంటి దుస్తులు ధరించకుండా కేవలం ఒక రేడియో మాత్రమే అడ్డుపెట్టుకుని కనిపించాడు. టాలీవుడ్ లో కమెడియన్ సంపూర్ణేష్ బాబు క్యాలీఫ్లవర్ అనే సినిమాలో కేవలం కాలీఫ్లవర్ మాత్రమే అడ్డుపెట్టుకొని బాడీపై దుస్తులు లేకుండా కనిపించాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అలా కనిపించి ఫ్యాన్స్ కి షాకిచ్చాడు.

ALSO READ: అగ్నినక్షత్రంగా మారిన మోహన్ బాబు

First Published:  2 July 2022 1:48 AM GMT
Next Story