Telugu Global
NEWS

రేవంత్ ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సిందే.. సోనియాకు లేఖరాస్తా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. టీఆరెస్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన యశ్వంత్ ను కాంగ్రెస్ నాయకులెవ్వరూ కలవొద్దని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన అక్కడితో ఆగలేదు. పార్టీ ఆదేశాలకు విరుద్దంగా ఎవరైనా వెళ్తే గోడకేసి కొడ్తా అని రెచ్చ గొట్టే విధంగా మాట్లాడారు. దాంతో ఆ పార్టీలో గొడవలు మొదలయ్యాయి. ఒక వైపు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీ. హన్మంతరావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి లు […]

రేవంత్ ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సిందే.. సోనియాకు లేఖరాస్తా
X

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. టీఆరెస్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన యశ్వంత్ ను కాంగ్రెస్ నాయకులెవ్వరూ కలవొద్దని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన అక్కడితో ఆగలేదు. పార్టీ ఆదేశాలకు విరుద్దంగా ఎవరైనా వెళ్తే గోడకేసి కొడ్తా అని రెచ్చ గొట్టే విధంగా మాట్లాడారు. దాంతో ఆ పార్టీలో గొడవలు మొదలయ్యాయి.

ఒక వైపు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీ. హన్మంతరావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి లు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గోడకేసి కొడ్తా అనడానికి రేవంత్ రెడ్డి ఎవరు ? అని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆయన తన ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారని, ఎంతో కాలంగా ఓపికగా ఉన్నామని, అయినా రేవంత్ ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకోవడ‌మేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉండటానికి అనర్హుడని జగ్గా రెడ్డి అన్నారు. తానొక్కడే నిర్ణయం తీసుకొని , ఎవరికీ చెప్పకుండా మీడియాతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడటమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా తక్షణం తొలగించాలని, అంతే కాదు రేవంత్ ను పార్టీ లోనుంచే తీసేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖ రాస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

First Published:  2 July 2022 8:45 AM GMT
Next Story