Telugu Global
NEWS

ఎంపీగా ఫెయిల్.. లీడర్ గా ఫెయిల్.. ఈగో కోసం తపన..!?

ఒక పారిశ్రామిక వేత్త.. ఆపై ఈ సంఘంలో ఒక పెద్ద మనిషి.. ఆ పై ఒక నాయకుడు.. రకరకాల పార్టీల్లో మార్పులు.. చివరికి ఒక ప్రజా ప్రతినిధి.. ఆ ప్రజా ప్రతినిధికి పార్టీతో గ్యాప్ వచ్చింది.. ఆ గ్యాప్ పెద్దదయింది.. సవాళ్లు, కేసులు, అరెస్టులు, కోర్టులు, బెయిల్లు, భయాలు వరకు వెళ్ళింది.. కానీ ఆ పెద్ద మనిషి నాయకుడిగా ఫెయిల్, ప్రజా ప్రతినిధి బాధ్యతల్లో పూర్తిగా ఫెయిల్.. రాజ్యాంగమిచ్చిన ఎంపీ పదవికి ఏ మాత్రం న్యాయం చేయలేదు […]

ఎంపీగా ఫెయిల్.. లీడర్ గా ఫెయిల్.. ఈగో కోసం తపన..!?
X

ఒక పారిశ్రామిక వేత్త.. ఆపై ఈ సంఘంలో ఒక పెద్ద మనిషి.. ఆ పై ఒక నాయకుడు.. రకరకాల పార్టీల్లో మార్పులు.. చివరికి ఒక ప్రజా ప్రతినిధి.. ఆ ప్రజా ప్రతినిధికి పార్టీతో గ్యాప్ వచ్చింది.. ఆ గ్యాప్ పెద్దదయింది.. సవాళ్లు, కేసులు, అరెస్టులు, కోర్టులు, బెయిల్లు, భయాలు వరకు వెళ్ళింది.. కానీ ఆ పెద్ద మనిషి నాయకుడిగా ఫెయిల్, ప్రజా ప్రతినిధి బాధ్యతల్లో పూర్తిగా ఫెయిల్.. రాజ్యాంగమిచ్చిన ఎంపీ పదవికి ఏ మాత్రం న్యాయం చేయలేదు సరికదా, తనకు ఓట్లేసిన ప్రజలకు కూడా ఏమి చేయలేకపోయారు.. ఆయనే ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. చివరికి ఇప్పుడు ప్రజల కోసమో.., ఓటర్ల కోసమో.. తన కోసం పని చేసిన నాయకుల కోసమో కాకుండా ప్రధాని భజన కోసం.. బీజేపీ ఆశీర్వాదం కోసం.. వైసీపీపై తన ఈగో గెలుపు కోసం ఇన్నాళ్ల తర్వాత “సొంత నియోజకవర్గంలో” అడుగు పెట్టడానికి అనేక భయాల మధ్య రెడీ అవుతున్నారు..!

ఈ సెక్షన్లు, చట్టాలు, సాకులు అప్పుడు లేవా..!?
రఘురామ తన సొంత నియోజకవర్గానికి రావాలి అనుకున్నారు.. ప్రధాని మోడీ సభలో పాల్గొనాలని అనుకున్నారు.. ఆయన ఆలోచన సబబే.. ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా, ప్రధాని సభలో ప్రోటోకాల్ ప్రకారమైనా ఆయన పాల్గొనాలి.. అది తప్పు కానే కాదు..! కానీ ఆయన ఇప్పుడు తన సొంత నియోజకవర్గానికి రావడానికి చేస్తున్న ప్రయత్నాలు, వేస్తున్న పిటిషన్లు చర్చనీయాంశమవుతున్నాయి. ఆయన వైసీపీకి రెబల్ గా మారి దాదాపు రెండున్నరేళ్లు అవుతుంది. ఈ రెండున్నరేళ్లలో ర‌ఘురామ‌పై వైసీపీ అనేక కేసులు పెట్టింది. అందులో ఆయన సొంత నియోజకవర్గంలోని దాదాపు ప్రతీ పోలీస్ స్టేషన్ లో ఏదో ఒక ఫిర్యాదు పెండింగ్ లో ఉంది.. ఆయన వస్తే మూసెయ్యడానికి, లోపలెయ్యడానికి పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు.. ఆ మేరకు ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు కూడా ఉన్నాయి..

ఆ విషయం ముందుగానే తెలిసింది కాబట్టే రఘురామ తన సొంత నియోజకవర్గానికి ఎప్పటి నుండో రావడం లేదు.. ఆ భయం ఆయనలో ఉండడం సహజమే.. కానీ ఇప్పుడు ప్రధాని మోడీ సభ ఉంది కాబట్టి రావాలి అనుకుంటున్నారు.. ఇప్పుడు రఘురామ చేస్తున్న ప్రయత్నాలు, వేస్తున్న పిటిషన్లు గతంలో ఎందుకు వేయలేదు..? ప్రధాని వస్తేనే సొంత నియోజకవర్గానికి వస్తారా..? ఆయనలో ఇప్పుడు లేని భయం అప్పుడెందుకు..!? అప్పుడు ఉన్న కేసులు, ఇప్పుడు లేవా!? ఇప్పుడున్న కోర్టులు అప్పుడు లేవా? అన్నీ ఒకటే కదా, అప్పుడూ ఇప్పుడూ ఒకటే కదా.. కానీ.. “రఘురామ ఆలోచనలో మాత్రమే తేడా, ఇక్కడికి రావాలనే కోరికలో మాత్రమే తేడా ఉంది.. ఇప్పుడు రావాలి అనుకున్నారు కాబట్టి పోరాటం చేసి, పిటిషన్లు వేసి వస్తున్నారు.. అప్పుడు రావాల్సిన అవసరాన్ని గుర్తించలేదు కాబట్టి ప్రయత్నాలు కూడా చేయలేదు. భయం పేరిట మొహం చాటేశారు..

అందుకే ఎంపీగా ఫెయిల్..!
రఘురామ వైసీపీ విరోధి కంటే.. ప్రధాని మోడీ భక్తుడిగా కంటే.. మొదట ఒక ఎంపీ.. ఆ నియోజకవర్గ ఓటర్లు ఓటేసి, తన అనుచరులు పని చేసి గెలిపించిన ఒక పార్లమెంటు సభ్యుడు.. సో, ఆయనకు రావాల్సిన బాధ్యత ఉంది. రెండేళ్లకు పైగా సొంత నియోజకవర్గానికి వెళ్లని ఎంపీ దేశంలో రఘురామ తప్ప ఇంకెవ్వరూ ఉండరేమో!? అందుకే రెబల్ ఎంపీగా ఫెయిల్.. ఒక నాయకుడిగా ఫెయిల్.. కేవలం వైసీపీ విరోధిగా, టీడీపీ అనుకూల మీడియాకు ఐటమ్ గా మాత్రమే రఘురామ పనికొస్తుండవచ్చు.. కేవలం వైసీపీపై గెలుపు ఈగో కోసం.., జగన్ పై ఈగో గెలుపు కోసం.. ఈసారి ఎలాగైనా బీజేపీ ముసుగులో, ప్రధాని భజనలో సొంత నియోజకవర్గానికి రావాలని తపన పడుతున్నారు. అంతే కానీ, తనకు ఓట్లేసిన వారి కోసమో, తన నియోజకవర్గ అభివృద్ధి కోసమో కాదు. అందుకే ఆయన ఎంపీగా ఫెయిల్, నాయకుడిగా ఫెయిల్!

First Published:  2 July 2022 5:32 AM GMT
Next Story