Telugu Global
MOVIE UPDATES

అందుకే ఆచార్య పోయింది.. పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల విడుదలై ఆచార్య చిత్రం ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందలేకపోయిన విషయం తెలిసిందే. ధర్మస్థలి, పాదఘట్టం అంటూ సినిమాల్లో పదే పదే మారుమోగిన పదాలు ప్రేక్షకులకు ఇరిటేషన్ తెప్పించాయి. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే కొరటాల కెరీర్ లో తొలిసారిగా ఆచార్య డిజాస్టర్‌గా నిలిచింది. మెగాస్టార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా ఈ సినిమా అపజయంపై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తనదైన శైలిలో విశ్లేషించారు. ఆయన […]

అందుకే ఆచార్య పోయింది.. పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
X

ఇటీవల విడుదలై ఆచార్య చిత్రం ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందలేకపోయిన విషయం తెలిసిందే. ధర్మస్థలి, పాదఘట్టం అంటూ సినిమాల్లో పదే పదే మారుమోగిన పదాలు ప్రేక్షకులకు ఇరిటేషన్ తెప్పించాయి. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే కొరటాల కెరీర్ లో తొలిసారిగా ఆచార్య డిజాస్టర్‌గా నిలిచింది. మెగాస్టార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా ఈ సినిమా అపజయంపై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తనదైన శైలిలో విశ్లేషించారు.

ఆయన ప్రస్తుతం ఓ యూట్యూబ్ చానల్ ద్వారా సినీరంగంలోకి ప్రవేశించాలనుకొనే ఔత్సాహికులకు పాఠాలు చెబుతున్నారు. అందులో భాగంగాగే సినిమాలపై విశ్లేషణలు చెబుతుంటారు. ఆచార్య అపజయంపై ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటితరం యువతకు కమ్యూనిజం నేపథ్యం ఉన్న సినిమాలు పెద్దగా ఎక్కడం లేదు. అసలు ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ పెట్టడం కూడా సరికాదు. ఓ ముఖ్యమైన ఘటన చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ ఘటనను చెప్పేందుకు చాలా టైం తీసుకోవడం ప్రేక్షకులకు చిరాకు తెప్పించి ఉండొచ్చు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సరిగ్గా లేదు.

చిరంజీవితో నక్సలైట్ పాత్ర చేయించి.. డ్యాన్సులు వేయించడం సరికాదు. సెంటిమెంట్, సస్పెన్స్ ఒకేచోట ఇమడవు. దర్శకుడు ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేది. ప్లాష్ బ్యాక్ ను అనవసరంగా సాగదీశారు. కేవలం 10 శాతం ప్లాష్ బ్యాక్ పెట్టి ఉంటే బాగుండేది. ఇక చరణ్ కు ఆ పాత్ర పెట్టడం కూడా సరికాదు.’ అంటూ పరుచూరి వ్యాఖ్యానించారు.

First Published:  2 July 2022 6:53 AM GMT
Next Story