Telugu Global
MOVIE UPDATES

ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన గీతాఆర్ట్స్

గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పెట్టిందే ప్రయోగాలు చేయడానికి. చిన్న, మీడియం-రేంజ్ బడ్జెట్ సినిమాలు తీస్తే, కొత్త కాన్సెప్టుల్ని పరిచయం చేయడం ఈ బ్యానర్ లక్ష్యం. ఇందులో భాగంగా దర్శకుడు గతంలో హిట్టిచ్చాడా, ఫ్లాప్ ఇచ్చాడా అనేది చూడడం లేదు ఈ సంస్థ. కాన్సెప్ట్ బాగుంటే పచ్చజెండా ఊపేస్తోంది. ఈ క్రమంలో మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చింది గీతాఆర్ట్స్-2 సంస్థ. జోహార్, అర్జున ఫల్గుణ లాంటి సినిమాలు తీసిన తేజ మర్ని దర్శకత్వంలో సినిమా లాంచ్ చేసింది జీఏ2 […]

ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన గీతాఆర్ట్స్
X

గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పెట్టిందే ప్రయోగాలు చేయడానికి. చిన్న, మీడియం-రేంజ్ బడ్జెట్ సినిమాలు తీస్తే, కొత్త కాన్సెప్టుల్ని పరిచయం చేయడం ఈ బ్యానర్ లక్ష్యం. ఇందులో భాగంగా దర్శకుడు గతంలో హిట్టిచ్చాడా, ఫ్లాప్ ఇచ్చాడా అనేది చూడడం లేదు ఈ సంస్థ. కాన్సెప్ట్ బాగుంటే పచ్చజెండా ఊపేస్తోంది. ఈ క్రమంలో మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చింది గీతాఆర్ట్స్-2 సంస్థ.

జోహార్, అర్జున ఫల్గుణ లాంటి సినిమాలు తీసిన తేజ మర్ని దర్శకత్వంలో సినిమా లాంచ్ చేసింది జీఏ2 పిక్చర్స్. పూర్తిగా కథ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తాడు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇదొక కాన్సెప్ట్ మూవీ. ఇందులో హీరోలు ఉండరు.

శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

ఇంతకుముందు చావు కబురు చల్లగా లాంటి కాన్సెప్ట్ సినిమాలు తీసింది గీతాఆర్ట్స్ సంస్థ. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, ఆ బ్యానర్ తన పంథాను మార్చలేదు. కొత్త కంటెంట్ ను, కొత్త నటీనటులు, టెక్నీషియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూనే ఉంది.

First Published:  2 July 2022 4:01 AM GMT
Next Story