Telugu Global
MOVIE UPDATES

అగ్నినక్షత్రంగా మారిన మోహన్ బాబు

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం “అగ్ని నక్షత్రం“. విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్ , జబర్దస్త్ మహేష్ నటీనటులుగా కనిపించనున్నారు. ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టైటిల్ ను లాంచ్ చేశారు. తండ్రీ కూతుళ్ళైన మోహన్ బాబు, మంచు లక్ష్మి మొట్టమొదటి సారిగా కలిసి నటించడం విశేషం. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ […]

అగ్నినక్షత్రంగా మారిన మోహన్ బాబు
X

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం “అగ్ని నక్షత్రం“. విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్ , జబర్దస్త్ మహేష్ నటీనటులుగా కనిపించనున్నారు. ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టైటిల్ ను లాంచ్ చేశారు.

తండ్రీ కూతుళ్ళైన మోహన్ బాబు, మంచు లక్ష్మి మొట్టమొదటి సారిగా కలిసి నటించడం విశేషం. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ అందించాడు. ఇప్పుడు రిలీజ్ అయిన లుక్స్ చూస్తుంటే ఇదొక పోలీస్ స్టోరీ వంటి విభిన్నమైన కథాంశంతో రూపొందింది అని అర్థం అవుతుంది.

ఇందులో విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళం లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మలయాళ నటుడు సిద్దిక్ విలన్ గా చైత్ర శుక్ల, సెకెండ్ హీరోయిన్ గా కనిపిస్తున్నారు. విశ్వంత్ హీరో.

ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తుండగా, మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ మ్యూజిక్ డైరక్టర్ గా వర్క్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.

First Published:  1 July 2022 11:17 PM GMT
Next Story