Telugu Global
NEWS

దీదీకి షాకిస్తున్న కేసీఆర్.. . యశ్వంత్ సిన్హాకి వెల్ కమ్ !

రాష్ట్రపతి ఎన్నిక ఏమోగానీ విపక్షాల్లో లుకలుకలు మొదలయ్యేట్టే ఉంది. ఇప్పటివరకు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఎంపిక చేయగా.. తమ ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను విపక్షాలు ఎంపిక చేశాయి.. బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. సిన్హా ఎంపికకు ఓకే చెప్పారు కూడా.. కానీ ఎందుకో ఇప్పుడు ఒక్కసారిగా ప్లేటు మార్చారు. ద్రౌపది ముర్ము తమ అభ్యర్థి అని బీజేపీ ముందే చెప్పి ఉంటే తాము ఆమెకే […]

KCR, Mamata Banerjee
X

రాష్ట్రపతి ఎన్నిక ఏమోగానీ విపక్షాల్లో లుకలుకలు మొదలయ్యేట్టే ఉంది. ఇప్పటివరకు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఎంపిక చేయగా.. తమ ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను విపక్షాలు ఎంపిక చేశాయి.. బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. సిన్హా ఎంపికకు ఓకే చెప్పారు కూడా.. కానీ ఎందుకో ఇప్పుడు ఒక్కసారిగా ప్లేటు మార్చారు. ద్రౌపది ముర్ము తమ అభ్యర్థి అని బీజేపీ ముందే చెప్పి ఉంటే తాము ఆమెకే సపోర్ట్ నిచ్చేవాళ్లమని, బీజేపీ తమ సలహాను అడిగి ఉండాల్సిందని దీదీ అంటున్నారు.

గిరిజన మహిళ అయిన ఆమెకు అపార రాజకీయ అనుభవం కూడా ఉందంటున్నారు. మరి ఇన్నాళ్లూ ఈమె కామ్ గా ఉన్నదెందుకు? ఆ మధ్య మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాని ‘మ్యాన్ ఆఫ్ గ్రేట్ హానర్’ అని ఆమె అభివర్ణించారు.

కాంగ్రెస్ సహా 13 విపక్షాలు ఆయన అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి కూడా.. కానీ ఎందుకో దీదీ స్వరం మారింది. మహారాష్ట్రలో రాజకీయపరిణామాలు మారి షిండే ఆధ్వర్యాన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మమత మారిపోయారా ? రాష్ట్రపతిగా ముర్ము గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

సీన్ కట్ చేస్తే…. శనివారం హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలికారు., 10 వేలమంది టీఆరెస్ కార్యకర్తల బైక్ ర్యాలీతో బేగంపేట నుంచి జలవిహార్ వరకు ట్రాఫిక్ అంతా కార్లు, వాహనాలతో నిండిపోయింది.

అసలు యశ్వంత్ సిన్హాకి ఇంతటి ఘన స్వాగతం పలకాలని కేసీర్ నిర్ణయించుకున్నారంటే.. ప్రతిపక్షాల్లో మమత కన్నా తనదే పైచేయి అని నిరూపించుకోవాలన్న ఉద్దేశమేనా ? లేక బీజేపీకి.. అందులోనూ ప్రధాని మోడీ కూడా నగరాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో ఆయనకు పోటీగా సిన్హాను తమవారిగా ప్రొజెక్టు చేయాలన్న లక్ష్యమా ? లేక ఈ రెండూ తన రాజకీయ ధ్యేయానికి మున్ముందు బాగా పనికి రావచ్చునన్న ఆశతోనా ? దేశ రాజకీయాలవైపు దృష్టి సారించిన కేసీఆర్ తాను అనుకున్నది కామ్ గా సాధిస్తున్నారు. ఓ వైపు సిటీలో బీజేపీ రెండు రోజుల సంబరాలు, మరోవైపు సిన్హా రాక ని ప్రతిష్టాత్మకంగా భావించి టీఆరెస్ చేస్తున్న సందడి ఇంతా అంతా కాదు.

కాంగ్రెస్ విషయానికి వస్తే..రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఢిల్లీలో యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసినప్పుడు ఈ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆయన వెంట ఉన్నారు. కానీ హైదరాబాద్ కు సిన్హా వచ్చినప్పుడు ఒక్కరంటే ఒక్కరు టీపీసీసీ నేత కూడా లేరు. పార్టీ సీనియర్ నేత వీహెచ్ మాత్రం సిన్హాకు స్వాగతం చెప్పినవారిలో ఉన్నారు. బహుశా సిన్హా విషయంలో ఢిల్లీకే పరిమితమవుదామని రేవంత్ రెడ్డి తదితరులు భావించినట్టున్నారు. ఇదెక్కడి వ్యుహమో మరి ?

మమత బీజేపీ ఏజంట్ ! కాంగ్రెస్ కొత్త ఆరోపణ

రాష్ట్రపతి ఎన్నికలో ద్రౌపది ముర్ము తప్పక గెలుస్తారంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విచిత్రంగా స్పందించింది. నిన్న మొన్నటివరకు యశ్వంత్ సిన్హాకు మద్దతునిచ్చిన ఆమె ఒక్కసారిగా ఇలా మాట్లాడడం ప్రధాని మోడీ ఆదేశాల మేరకేనని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు.

మోడీతో ఆమె రహస్య అవగాహన కుదుర్చుకున్నారని, ఆమె బీజేపీ ఏజంటులా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇది మళ్ళీ బయటపడిందని అన్నారు. రాష్ట్రపతి పదవికి ఏకాభిప్రాయ సాధనతో అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ చెబుతూ వచ్చిందని, ఇప్పడు దీదీ అదే పాట పాడుతున్నారని అధిర్ రంజన్ చౌదరి అన్నారు. సో.. ఆమె ఆ పార్టీ ఏజంట్ అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలన్నారు.

First Published:  2 July 2022 2:36 AM GMT
Next Story