Telugu Global
MOVIE UPDATES

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ రెడీ

ఆచార్య ఫ్లాప్ నుంచి కోలుకున్న చిరంజీవి, ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్స్ లో బిజీ అవుతున్నారు. ఇందులో భాగంగా కొత్త సినిమా ప్రమోషన్ మొదలుపెట్టారు. చిరంజీవి కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ జాయింట్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. ఈ చిత్రం నుండి మెగా అప్దేట్ వచ్చింది. గాడ్‌ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 4న సాయంత్రం 5:45 గంటలకు లాంచ్ చేయనున్నారు. గాడ్‌ఫాదర్ రాక […]

chiranjeevi
X

ఆచార్య ఫ్లాప్ నుంచి కోలుకున్న చిరంజీవి, ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్స్ లో బిజీ అవుతున్నారు. ఇందులో భాగంగా కొత్త సినిమా ప్రమోషన్ మొదలుపెట్టారు. చిరంజీవి కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ జాయింట్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు.

ఈ చిత్రం నుండి మెగా అప్దేట్ వచ్చింది. గాడ్‌ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 4న సాయంత్రం 5:45 గంటలకు లాంచ్ చేయనున్నారు. గాడ్‌ఫాదర్ రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ఫస్ట్ లుక్ డేట్ ని ప్రకటించింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు మెగాస్టార్లకు ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే ఓ సాంగ్ కూడా ఉంది. ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు. సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

First Published:  1 July 2022 11:21 PM GMT
Next Story