Telugu Global
NEWS

ఏపీ రాజకీయాల్లో ఫేక్ ప్రచారాలు..

వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా అంటూ ఫేక్ పోస్ట్.. కుప్పంలో చంద్రబాబుపై విశాల్ పోటీ అంటూ మరో ఫేక్ పోస్ట్.. టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు మూసేస్తాం, వాలంటీర్లను తీసేస్తామంటూ అచ్చెన్నాయుడు చెప్పినట్టు మరో ఫేక్ పోస్ట్.. ఇదీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఫేక్ రాజకీయం. ఎవరు ఈ పోస్ట్ లు క్రియేట్ చేస్తారు, ఎవరు వాటిని షేర్ చేస్తారు, అసలు ఇలాంటి వాటి వల్ల ఎవరికి లాభం, ఎంత లాభం అనే విషయాలు […]

vishal
X

వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా అంటూ ఫేక్ పోస్ట్..
కుప్పంలో చంద్రబాబుపై విశాల్ పోటీ అంటూ మరో ఫేక్ పోస్ట్..
టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు మూసేస్తాం, వాలంటీర్లను తీసేస్తామంటూ అచ్చెన్నాయుడు చెప్పినట్టు మరో ఫేక్ పోస్ట్..

ఇదీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఫేక్ రాజకీయం. ఎవరు ఈ పోస్ట్ లు క్రియేట్ చేస్తారు, ఎవరు వాటిని షేర్ చేస్తారు, అసలు ఇలాంటి వాటి వల్ల ఎవరికి లాభం, ఎంత లాభం అనే విషయాలు పక్కనపెడితే.. ఫేక్ ప్రచారాలు చేయడంలో మాత్రం కొంతమంది మరీ అత్యుత్సాహం చూపిస్తున్నారు. చివరకు జైలుపాలవుతున్నారు.

ఆమధ్య ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అంటూ చాలామంది తెలిసీ తెలియని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోర్టు కేసులు ఎదుర్కొన్నారు.

తాజాగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలు అనే పోస్ట్ కి విజయమ్మ రాజీనామా అంటూ ఓ ఫేక్ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ ఫేక్ పోస్ట్ వ్యవహారంలో వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు.. సీఐడీ పోలీసులు గార్లపాటి వెంకటేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తనను కొట్టారంటూ వెంకటేష్ ఆరోపణలు, వైద్య పరీక్షలు.. చివరకు ఈ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది.

హీరో విశాల్, కుప్పంలో చంద్రబాబుపై పోటీకి దిగుతున్నారని, వైసీపీ టికెట్ పై ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు, తాజాగా విశాల్ కూడా ట్విట్టర్లో స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకోవట్లేదని తేల్చేశారు.


ఇక సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ రద్దు అంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో సర్క్యులేట్ అయిన ఫేక్ పోస్ట్ తో టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రచారం అవాస్తవం అంటూ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఖండన ప్రకటన విడుదల చేశారు. మొత్తమ్మీద ఆ పార్టీ, ఈ పార్టీ అనే భేదం లేకుండా ఫేక్ పోస్టింగ్ లతో అన్ని పార్టీల నాయకులు సతమతం అవుతున్నారు. నిజం గడపదాటేలోపు ఫేక్ పోస్ట్ ప్రపంచం చుట్టొచ్చేస్తోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పోటీ పోటీగా ఈ ఫేక్ పోస్ట్ ల ప్రచారం జరుగుతోంది.

First Published:  2 July 2022 1:25 AM GMT
Next Story