Telugu Global
NEWS

వైసీపీ నేతల్లో రెండో ఆలోచన మొదలైంది- బొత్స

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లాస్థాయి ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. వైసీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఈ మధ్య రెండో ఆలోచన మొదలైందన్నారు. అదే జరిగితే అందరం నష్టపోతామని హెచ్చరించారు. ” మేం చెప్పేది చాగంటి ప్రవచనలు అనుకోవద్దు. వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఈ మధ్య రెండో ఆలోచన మొదలైంది. మైండ్ ఈ మధ్య కాస్త డైవర్షన్‌కు గురవుతోంది. అదే నిజమైతే అందరం నష్టపోతాం” అని వ్యాఖ్యానించారు. పక్క చూపులు చూడవద్దని […]

వైసీపీ నేతల్లో రెండో ఆలోచన మొదలైంది- బొత్స
X

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లాస్థాయి ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. వైసీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఈ మధ్య రెండో ఆలోచన మొదలైందన్నారు. అదే జరిగితే అందరం నష్టపోతామని హెచ్చరించారు.

” మేం చెప్పేది చాగంటి ప్రవచనలు అనుకోవద్దు. వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో ఈ మధ్య రెండో ఆలోచన మొదలైంది. మైండ్ ఈ మధ్య కాస్త డైవర్షన్‌కు గురవుతోంది. అదే నిజమైతే అందరం నష్టపోతాం” అని వ్యాఖ్యానించారు. పక్క చూపులు చూడవద్దని సూచించారు. ”కార్యకర్తల్లో, నాయకుల్లో మనస్పర్థలుంటే చర్చించుకుందాం. అంతే తప్ప పార్టీని నాశనం చేయవద్దు. మేం ఒక స్థాయికి వచ్చాం. అధికారం ఉన్నా లేకున్నా మాకేం కాదు. గ్రామస్థాయిలో మీకే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి” అంటూ గ్రామస్థాయి నాయకులను ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గ్రాఫ్‌ బాగుందని, దాన్ని అందరం కలిసి నిలబెట్టాలని పిలుపునిచ్చారు.

30 కోట్లు ఆఫర్‌ చేసినా పోలేదు- రాజన్న దొర
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 30 కోట్ల రూపాయలతో పాటు అమరావతిలో ఇల్లు ఇస్తామని ఆఫర్ చేశారని.. అయినా సరే జగన్‌ మీద నమ్మకంతో తాను వెళ్లలేదని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రాజన్నదొర చెప్పారు. ఆ రోజు టీడీపీలోకి వెళ్లకపోవడం వల్లనే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని వివరించారు. తొలిసారి మంత్రి పదవి ఇవ్వకపోయినా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. పత్రికల్లో, టీవీల్లో వస్తున్న వార్తల్లో ఏది నిజమో ప్రజలు తెలుసుకోవాలని కోరారు.

ధరల పెరుగుదలతో రాష్ట్రానికి సంబంధం లేదు- బుగ్గన
ధరల పెరుగుదలకు రాష్ట్రాన్ని నిందించడం సరికాదన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ధరల పెరుగుదల కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమన్నారు. జనానికి పంచేందుకే అప్పులు తెస్తున్నామని, పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయక తప్పదన్నారు.

First Published:  1 July 2022 9:28 PM GMT
Next Story