Telugu Global
NEWS

బస్ టికెట్‌తో పాటు దర్శనం టికెట్.. టీఎస్ఆర్టీసీ కొత్త పథకం

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలనుకునే తెలంగాణ వాసులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆర్టీసీ టికెట్‌తో పాటే ప్రత్యేక దర్శనానికి కూడా స్పాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇవ్వాల్టి (01.07.22) నుంచి ఈ పథకం అమలులోకి వచ్చిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో టీఎస్ఆర్టీసీ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుందని.. ప్రతీ రోజు 1000 టికెట్లు అమ్ముతామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ వెబ్‌సైట్ […]

బస్ టికెట్‌తో పాటు దర్శనం టికెట్.. టీఎస్ఆర్టీసీ కొత్త పథకం
X

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలనుకునే తెలంగాణ వాసులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆర్టీసీ టికెట్‌తో పాటే ప్రత్యేక దర్శనానికి కూడా స్పాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇవ్వాల్టి (01.07.22) నుంచి ఈ పథకం అమలులోకి వచ్చిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో టీఎస్ఆర్టీసీ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుందని.. ప్రతీ రోజు 1000 టికెట్లు అమ్ముతామని ఆయన స్పష్టం చేశారు.

ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా ఆథరైజ్డ్ డీలర్ ద్వారా వారం రోజుల ముందుగా బస్ టికెట్ బుక్ చేసుకునే వాళ్లు.. ప్రత్యేక దర్శనం టికెట్ కూడా తీసుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతీ డిపో నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం ఉన్నది.

కేవలం తెలంగాణ వాసులే కాకుండా.. సరిహద్దులో ఉన్న ఆంధ్రా ఊర్ల నుంచి వెళ్లే వారు కూడా తెలంగాణ ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకుంటే ఈ పథకం వర్తించనున్నది.

ఇక టీఎస్ఆర్టీసీ-పోస్టల్ శాఖ మధ్య కూడా ఒక ఒప్పందం జరిగిందని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలోని పోస్టాఫీసుల ద్వారా ఆర్టీసీ కార్గో ద్వారా వచ్చే పార్శిల్స్‌ను హోం డెలివరీ చేయనున్నారు.

ప్రస్తుతం 27 ప్రాంతాల్లో ఈ పార్శిల్ డెలివరీ ప్రారంభించారు. రాబోయే రోజుల్లో అన్ని పిన్ కోడ్‌లలో ఈ సౌకర్యం లభించనున్నట్లు ఆయన తెలిపారు.

First Published:  30 Jun 2022 11:17 PM GMT
Next Story