Telugu Global
NEWS

కుప్పం అభ్యర్థులు ఖరారు..

2024 ఎన్నికల్లో కుప్పంలో ఎవరెవరు పోటీ చేస్తారనే విషయంపై రెండేళ్ల ముందుగానే క్లారిటీ వచ్చింది. టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు మరోసారి కుప్పంలో పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధం కూడా ఉంది. కుప్పంలో తగ్గిపోతున్న మెజార్టీ, ఆ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో కుప్పం ఎంపీటీసీ స్థానం కోల్పోవడం, ఆ వెంటనే మున్సిపాల్టీ కూడా చేజారడంతో.. అప్పట్లో బాబు ఆలోచనలో పడ్డారని, ఆయన నియోజకవర్గం మార్చేస్తారనే ప్రచారం జరిగింది. చంద్రబాబు కుప్పంనుంచి పారిపోతున్నారని […]

కుప్పం అభ్యర్థులు ఖరారు..
X

2024 ఎన్నికల్లో కుప్పంలో ఎవరెవరు పోటీ చేస్తారనే విషయంపై రెండేళ్ల ముందుగానే క్లారిటీ వచ్చింది. టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు మరోసారి కుప్పంలో పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధం కూడా ఉంది. కుప్పంలో తగ్గిపోతున్న మెజార్టీ, ఆ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లో కుప్పం ఎంపీటీసీ స్థానం కోల్పోవడం, ఆ వెంటనే మున్సిపాల్టీ కూడా చేజారడంతో.. అప్పట్లో బాబు ఆలోచనలో పడ్డారని, ఆయన నియోజకవర్గం మార్చేస్తారనే ప్రచారం జరిగింది. చంద్రబాబు కుప్పంనుంచి పారిపోతున్నారని పదే పదే వైసీపీ నేతలు కూడా ఎద్దేవా చేశారు. అయితే చంద్రబాబు మాత్రం ఇన్నాళ్లూ లేనిది, ఇప్పుడు ఓ సొంత ఇంటిని కూడా కుప్పం పరిధిలో కట్టుకుంటున్నారు, పరోక్షంగా తానే అక్కడ అభ్యర్థిని అని తేల్చి చెప్పారు.

ఇక వైసీపీ విషయానికొద్దాం. వైసీపీ తరపున 2014, 2019లో మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు భరత్ కు కుప్పం నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగించారు జగన్, అంతే కాదు, ఆయన్ను ఎమ్మెల్సీ కూడా చేశారు. ఎమ్మెల్సీ కావడంతో భరత్ కు కుప్పం టికెట్ ఇవ్వకపోవచ్చనే వాదన కూడా మొదలైంది. అయితే కుప్పంపై భరత్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కారణం భరత్. దీంతో అక్కడ చంద్రబాబుని ఢీకొనే నాయకుడు భరత్ అని వైసీపీ అధిష్టానం బలంగా నమ్ముతోంది. ఈ దశలో ప్లీనరీ సమావేశంలో భరత్ ని అభ్యర్థిగా ప్రకటించేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

హీరో విశాల్ సంగతేంటి..?
తెలుగువాడైన తమిళ హీరో విశాల్ కుప్పం నుంచి వైసీపీ టికెట్ ఆశిస్తున్నారని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయన చంద్రబాబుపై పోటీ చేస్తారనే ఊహాగానాలు ఇటీవల బలంగా వినిపించాయి. సినీ రంగం నుంచి సడన్ గా రాజకీయాల్లోకి విశాల్ ఎందుకొస్తారు, వచ్చినా చంద్రబాబుపై ఎందుకు పోటీ చేస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీనిపై కూడా మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అదంతా టీడీపీ ఛీప్ ట్రిక్స్ గా కొట్టిపారేశారు పెద్దిరెడ్డి. కుప్పం నుంచి భరత్ వైసీపీ అభ్యర్థి అని ఆయన తేల్చి చెప్పారు.

సో.. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే కుప్పంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ నుంచి చంద్రబాబు, వైసీపీ నుంచి భరత్ పోటీ చేయడం ఖాయం. ఇప్పటికే టీడీపీకి కావాల్సినంత భయాన్ని రుచి చూపించారు భరత్. ఇక సార్వత్రిక ఎన్నికల నాటికి ఆయన ఎలాంటి వ్యూహాలతో చెలరేగిపోతారో వేచి చూడాలి.

First Published:  30 Jun 2022 8:21 PM GMT
Next Story