Telugu Global
National

32 మంది ఐపీఎస్ లపై బదిలీ వేటు..

శాంతి భద్రతల సమస్య వస్తే, దానికి ఫలానా అధికారి వైఫల్యం కారణం అనుకుంటే.. వెంటనే వారిని బదిలీ చేస్తుంది ప్రభుత్వం. ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా దీనికి మినహాయింపు లేదు. అయితే ఓ హత్యకేసు కారణంగా 32 మంది ఐపీఎస్ లు బదిలీ అయిన సంఘటన దేశ చరిత్రలోనే బహుశా ఇదే మొదటిది కావొచ్చు. రాజ‌స్థాన్‌ ఉద‌య్‌ పూర్‌ లో జరిగిన టైల‌ర్ క‌న్హ‌య్య లాల్ హ‌త్య కేసు నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో ప‌నిచేస్తున్న 32 మంది […]

32 మంది ఐపీఎస్ లపై బదిలీ వేటు..
X

శాంతి భద్రతల సమస్య వస్తే, దానికి ఫలానా అధికారి వైఫల్యం కారణం అనుకుంటే.. వెంటనే వారిని బదిలీ చేస్తుంది ప్రభుత్వం. ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా దీనికి మినహాయింపు లేదు. అయితే ఓ హత్యకేసు కారణంగా 32 మంది ఐపీఎస్ లు బదిలీ అయిన సంఘటన దేశ చరిత్రలోనే బహుశా ఇదే మొదటిది కావొచ్చు. రాజ‌స్థాన్‌ ఉద‌య్‌ పూర్‌ లో జరిగిన టైల‌ర్ క‌న్హ‌య్య లాల్ హ‌త్య కేసు నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో ప‌నిచేస్తున్న 32 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం.

కన్హయ్య లాల్ హత్య తర్వాత రాజస్థాన్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పట్ట పగలు, ఇద్దరు వ్యక్తులు ఓ టైలర్ ని అతి కిరాకతంగా కత్తులతో నరికి చంపడం, శవాన్ని రోడ్డుపై పడేసి పారిపోవడం, ఆ హత్యను సెల్ ఫోన్లో రికార్డ్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తుంటే.. అసలు పోలీసులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు ప్రజలు, సోషల్ మీడియాలో తీవ్రంగా పోలీస్ వ్యవస్థను ట్రోల్ చేశారు. హంతకుల్ని అదేరోజు పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఆందోళనలు కాస్త చల్లారాయి. కానీ చివరకు పోలీసులపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

స్థానిక పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణను జాతీయ ద‌ర్యాప్తు ఏజెన్సీ(NIA)కి అప్ప‌గించారు. పాకిస్తాన్ లోని దావ‌త్ ఏ ఇస్లామీ గ్రూపుతో వారికి సంబంధాలు ఉన్న‌ట్లు అనుమానిస్తున్నారు. ఉద‌య్‌ పూర్ ఘ‌ట‌న‌ను ఉగ్ర‌వాద చ‌ర్య‌గా భావిస్తున్నట్టు తెలిపారు రాజ‌స్థాన్ పోలీస్ చీఫ్ ఎంఎల్ లాథ‌ర్. ఈ కేసులో ఇద్ద‌రు నిందితుల‌కు కోర్టు రిమాండ్ విధించింది.

First Published:  1 July 2022 4:44 AM GMT
Next Story