Telugu Global
Health & Life Style

మొండి చుండ్రుకు అల్లం చేసే మ్యాజిక్!

చిటపట చినుకులు పడుతూ ఉంటే ఆ జల్లులను చూస్తూ తడవకుండా ఉండలేరు. ఇంకొందరు తడవకూడదు అనుకున్నా రోడ్ మీద నడుస్తున్నప్పుడో, ఆరు బయట పనులు చేస్తున్నప్పుడో తడిచి ముద్దవుతారు. వర్షంలో తడవడం, ఈ సీజన్ లో చల్లని వాతావరణాన్ని అనుభూతి చెందడం అందరికీ ఇష్టమే. అయితే వానలో తడవడం ఎంత ఆనందాన్ని ఇస్తుందో.. తల ఆరకపోవడం దురద పుట్టడం వంటివి చికాకును తెప్పిస్తుంది. వీటితో పాటు కొన్ని ఇబ్బందుల్నీ తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా వెంట్రుకలకు సంబంధించిన సమస్యలలో ఒకటైన […]

మొండి చుండ్రుకు అల్లం చేసే మ్యాజిక్!
X

చిటపట చినుకులు పడుతూ ఉంటే ఆ జల్లులను చూస్తూ తడవకుండా ఉండలేరు. ఇంకొందరు తడవకూడదు అనుకున్నా రోడ్ మీద నడుస్తున్నప్పుడో, ఆరు బయట పనులు చేస్తున్నప్పుడో తడిచి ముద్దవుతారు. వర్షంలో తడవడం, ఈ సీజన్ లో చల్లని వాతావరణాన్ని అనుభూతి చెందడం అందరికీ ఇష్టమే. అయితే వానలో తడవడం ఎంత ఆనందాన్ని ఇస్తుందో.. తల ఆరకపోవడం దురద పుట్టడం వంటివి చికాకును తెప్పిస్తుంది.

వీటితో పాటు కొన్ని ఇబ్బందుల్నీ తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా వెంట్రుకలకు సంబంధించిన సమస్యలలో ఒకటైన చుండ్రు చాలా మొండిగా మారి వేధిస్తుంటుంది. తలలో దురద, తెల్లగా పొట్టులాగా లేవడం అది కాస్తా మంటగా మారి ఇబ్బంది పెట్టడం.

వీటి వల్ల జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు డల్ గా మారిపోవడం. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా సమస్యలు ఒకదాని వెనుక మరొకటి తరచుగా వస్తూ ఉంటాయి. ఈ చుండ్రుకు చెక్ పెట్టడానికి బోలెడు ప్రయత్నాలే చేస్తుంటారు.

చుండ్రు సమస్యకు కెమికల్స్ వాడటం కంటే మన ఇంట్లో ఉపయోగించే పదార్థాలతోనే తగ్గించవచ్చు. మన రోజువారి ఆహారంలో విరివిగా వాడే అల్లం కఫాన్ని తగ్గించి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అల్లంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు శరీరానికి రోగనిరోధకశక్తిని పెంచేలా చేస్తాయి. ఇది మాత్రమే కాకుండా అల్లం చర్మ సంరక్షణలోనూ గొప్ప మ్యాజిక్ చేస్తుంది.

ఎంతో సహజసిద్ధమైన పద్దతిలో చుండ్రు సమస్యకు అల్లాన్ని అయిదు రకాలుగా ఉపయోగించి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని ప్రయోగాలు తెలిపాయి.

అల్లం రసంతో అదిరే చిట్కా:-
అల్లం రసంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగస్ గుణాలు జుట్టుకు మేలు చేస్తాయి. అల్లాన్ని దంచి లేదా గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి. ఈ రసంలో కాటన్ బాల్ ను ముంచి నేరుగా చుండ్రు ప్రభావిత ప్రాంతంలో సున్నితంగా అప్లై చెయ్యాలి.

ఇది కేవలం చుండ్రును తొలగించడానికి మాత్రమే కాకుండా రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఫలితంగా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. చుండ్రు అధికంగా ఉంటే అల్లం రసాన్ని నిమ్మరసంతో కలిపి ఉపయోగించవచ్చు.

సల్పేట్ లేని షాంపూ:-
ఈ మధ్య కాలంలో చాలావరకూ వెంట్రుకల కండిషనర్ గా షాంపూలు వాడుతుంటారు. చుండ్రు తగ్గించుకోవడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అల్లం రసం నేరుగా కాకుండా సల్పేట్ లేని షాంపూ తీసుకుని కొద్దిగా ఒక కప్ లో వేసుకోవాలి. ఆ షాంపూ లోకి దంచి తీసిన అల్లం రసాన్ని కలపాలి. ఈ మిశ్రమంతో తల స్నానం చేస్తే కేవలం చుండ్రు తగ్గిపోవడం మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యవంతంగా కూడా ఉంటుంది.

సూపర్ ఆయిల్:-
జుట్టును ఆరోగ్యవంతంగా ఉంచడానికి హెయిర్ ఆయిల్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. తరచుగా ఆయిల్ పెట్టడం లేదా గోరు వెచ్చని ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు ఆరోగ్యంగా మారతాయి, రక్తప్రసరణ చక్కగా ఉంటుంది. తలలో ఉండే పుండ్లు, చుండ్రు, ఇతర సమస్యలు తగ్గుతాయి. అయితే చుండ్రుకు చెక్ పెట్టడానికి అల్లం బేస్డ్ ఆయిల్స్ సూపర్ గా పనిచేస్తాయి. అల్లం రసం కలిపి తయారు చేసిన నూనె వాడొచ్చు. ఇవి తాత్కాలికంగా కాకుండా ఎక్కువ రోజులు చుండ్రు ఎఫెక్ట్ నుండి దూరంగా ఉంచుతాయి.

బెస్ట్ హెయిర్ వాష్ :-
జుట్టు కోసం ఎన్ని పద్ధతులు పాటించినా వెంట్రుకలను శుభ్రం చేసే పద్ధతి సరిగ్గా లేకుంటే జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. హెయిర్ వాష్ కి యాపిల్ సైడర్ వెనిగర్, బియ్యం నీళ్లు వంటి వాటిలోకి అల్లం రసాన్ని కలిపితే ఇంకా ఎక్కువ ప్రభావంగా పనిచేస్తుంది.

మ్యాజిక్ మాస్క్:-
హెయిర్ కలర్ కోసమో, లేదా జుట్టు పెరిగేందుకో హెన్నాను జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తూ ఉంటారు దీనితో పాటు మార్కెట్ లోకి బోలెడు హెయిర్ ప్యాక్ లు వచ్చాయి. అయితే చుండ్రు సమస్యను దూరం చేసుకోవడానికి ఏ హెయిర్ ప్యాక్ వాడినా దాంట్లోకి అల్లం రసాన్ని కలిపి పెట్టుకుంటే ఎంతో బాధించే చుండ్రుకు బై బై చెప్పేయచ్చు.

First Published:  30 Jun 2022 11:28 PM GMT
Next Story