Telugu Global
MOVIE UPDATES

శ్రీవిష్ణు సినిమా.. పరాజయం పరిపూర్ణం

శ్రీవిష్ణు నటించిన రీసెంట్ మూవీ భళా తందనాన. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో క్యాథరీన్ హీరోయిన్ గా నటించింది. థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఓటీటీలోకొచ్చి అక్కడ కూడా ఫెయిలైంది. ఇప్పుడీ సినిమా పరాజయం పరిపూర్ణమైంది. ఎందుకంటే, టీవీల్లో కూడా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ఈ సినిమాను ప్రసారం చేశారు. భారీగా ప్రచారం కూడా […]

శ్రీవిష్ణు సినిమా.. పరాజయం పరిపూర్ణం
X

శ్రీవిష్ణు నటించిన రీసెంట్ మూవీ భళా తందనాన. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో క్యాథరీన్ హీరోయిన్ గా నటించింది. థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఓటీటీలోకొచ్చి అక్కడ కూడా ఫెయిలైంది. ఇప్పుడీ సినిమా పరాజయం పరిపూర్ణమైంది. ఎందుకంటే, టీవీల్లో కూడా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ఈ సినిమాను ప్రసారం చేశారు. భారీగా ప్రచారం కూడా చేశారు. అయినప్పటికీ ఈ మూవీని బుల్లితెర వీక్షకులు పట్టించుకోలేదు. ఫలితంగా మొదటి ఎయిరింగ్ కే కేవలం 2.3 టీఆర్పీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఈ సినిమా.

తొలిసారి ప్రసారం చేసినప్పుడే ఇంత తక్కువ రేటింగ్ అంటే.. ఇక రిపీట్ లో ఈ సినిమాను ఆడియన్స్ అస్సలు పట్టించుకోరని అర్థం. ఈ సినిమా కంటే బన్నీ, మహేష్ నటించిన సినిమాల రిపీట్ ఎయిరింగ్స్ కు ఎక్కువ రేటింగ్స్ వచ్చాయి.

ఈ సినిమా ఫలితంతో శ్రీవిష్ణు, తన లైనప్ పై మరోసారి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అతడికి నాన్-థియేట్రికల్ మార్కెట్టే బలం. ఇప్పుడు అది కూడా తగ్గిపోతోంది.

First Published:  30 Jun 2022 10:41 PM GMT
Next Story