Telugu Global
MOVIE UPDATES

అల్లూరి ఫస్ట్ లుక్.. శ్రీవిష్ణు నుంచి మరో మాస్ అవతారం

హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఓ పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌లో నటిస్తున్నాడు. ‘అల్లూరి’ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో ‘నిజాయితీకి మారుపేరు’ అనే పవర్ ఫుల్ ట్యాగ్ లైన్ హీరో పాత్రని సూచించేలా వుంది. ఈ పాత్ర కోసం శ్రీవిష్ణు పూర్తిగా మేకోవర్ […]

అల్లూరి ఫస్ట్ లుక్.. శ్రీవిష్ణు నుంచి మరో మాస్ అవతారం
X

హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఓ పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌లో నటిస్తున్నాడు. ‘అల్లూరి’ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు.

ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో ‘నిజాయితీకి మారుపేరు’ అనే పవర్ ఫుల్ ట్యాగ్ లైన్ హీరో పాత్రని సూచించేలా వుంది. ఈ పాత్ర కోసం శ్రీవిష్ణు పూర్తిగా మేకోవర్ అయినట్టు కనిపిస్తోంది. ఖాకీ యూనిఫాంలో చేతిలో తుపాకీ పట్టుకుని డాషింగ్ గా కనిపిస్తున్నాడు. వర్షంలో చేతిలో గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో నడుస్తూ రావడం స్టన్నింగా ఉంది. సిన్సియర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న అల్లూరి ఫస్ట్ లుక్ ఎట్రాక్ట్ చేసేలా ఉంది.

దర్శకుడు ప్రదీప్ వర్మ నిజాయితీ గల ఒక పోలీసు కథ చెప్పడానికి చాలా రిసెర్చ్ చేశాడు. ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన రోజు మొదలైన ప్రయాణంలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, అతను చేసే త్యాగాలు, సమాజం, ఉన్నతాధికారుల నుండి అతను ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొన్నాడనే అంశాలు ఆసక్తికరంగా చూపించబోతున్నారు. అతను తన ఆలోచనలతో మొత్తం డిపార్ట్‌మెంట్‌లో పెద్ద మార్పును తీసుకువస్తాడు.

ఈ సినిమాతో కైదూ లోహర్ హీరోయిన్ గా పరిచయమౌతోంది. సుమన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అల్లూరి ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించి, ప్రమోషన్‌ ప్రారంభిస్తారు.

First Published:  1 July 2022 6:41 AM GMT
Next Story