Telugu Global
MOVIE UPDATES

సలార్ లో కేజీఎఫ్ హీరో.. నిజమేనా?

ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్. ఈ సినిమాలోకి కేజీఎఫ్ స్టార్ యష్ అడుగుపెట్టబోతున్నాడు. సినిమాలో యష్, కొద్దిసేపు అలా కనిపించి వెళ్తాడని సమాచారం. ప్రస్తుతం దీనిపై చర్చలు సాగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ కు క్రేజ్ తీసుకురావడం కోసం ఈ ఉపాయం ఆలోచించాడని అంటున్నారు. ప్రభాస్‌తో పాటు ‘రాకీ భాయ్’ ను ఒకే తెరపై చూపిస్తే.. సినిమాకు మరింత బజ్ పెరుగుతుందనేది అతడి ఆలోచన. ఒకవేళ ఈ ఊహాగానాలే నిజమైతే మాత్రం.. […]

సలార్ లో కేజీఎఫ్ హీరో.. నిజమేనా?
X

ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్. ఈ సినిమాలోకి కేజీఎఫ్ స్టార్ యష్ అడుగుపెట్టబోతున్నాడు. సినిమాలో యష్, కొద్దిసేపు అలా కనిపించి వెళ్తాడని సమాచారం. ప్రస్తుతం దీనిపై చర్చలు సాగుతున్నాయి.

దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ కు క్రేజ్ తీసుకురావడం కోసం ఈ ఉపాయం ఆలోచించాడని అంటున్నారు. ప్రభాస్‌తో పాటు ‘రాకీ భాయ్’ ను ఒకే తెరపై చూపిస్తే.. సినిమాకు మరింత బజ్ పెరుగుతుందనేది అతడి ఆలోచన.

ఒకవేళ ఈ ఊహాగానాలే నిజమైతే మాత్రం.. సౌత్ లోనే అతి పెద్ద గెస్ట్ ఎప్పీయరెన్స్ ఇదే అవుతుంది. ఎందుకంటే పాన్-ఇండియా స్టార్లు ప్రభాస్, యష్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారు.

‘సలార్’లో యష్ అతిధి పాత్ర గురించి సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ జరుగుతుంది. ఇటు ప్రభాస్, అటు ప్రశాంత్ నీల్ ఇద్దరికీ యష్ క్లోజ్ ఫ్రెండ్. కాబట్టి సలార్ లో కనిపించడానికి అతడికి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. పైగా ప్రశాంత్ నీల్ అడిగితే అస్సలు కాదనకపోవచ్చు.

హోంబలే ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

First Published:  30 Jun 2022 2:01 AM GMT
Next Story