Telugu Global
MOVIE UPDATES

వైజయంతీ కొత్త ఆఫీస్.. వీడియో వైరల్

నిన్న సాయంత్రం నుంచి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం అందులో ఉన్న హీరోలు, టెక్నీషియన్స్. ఇంతకీ ఆ వీడియో ఏంటి? అందులో ఉన్న స్టార్స్ ఎవరు? వైజయంతీ మూవీస్ సంస్థ హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ తెరిచింది. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి భారీ తారాగణాన్ని ఆహ్వానించింది. బిగ్ బి అమితాబ్, ప్రభాస్, నాని, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ నీల్.. ఇలా చాలామంది ఈ వీడియోలో కనిపించడంతో అది కాస్తా వైరల్ అయింది స్వయంగా […]

వైజయంతీ కొత్త ఆఫీస్.. వీడియో వైరల్
X

నిన్న సాయంత్రం నుంచి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దానికి కారణం అందులో ఉన్న హీరోలు, టెక్నీషియన్స్. ఇంతకీ ఆ వీడియో ఏంటి? అందులో ఉన్న స్టార్స్ ఎవరు?

వైజయంతీ మూవీస్ సంస్థ హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ తెరిచింది. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి భారీ తారాగణాన్ని ఆహ్వానించింది. బిగ్ బి అమితాబ్, ప్రభాస్, నాని, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ నీల్.. ఇలా చాలామంది ఈ వీడియోలో కనిపించడంతో అది కాస్తా వైరల్ అయింది

స్వయంగా ప్రభాస్, బిగ్ బి కలిసి రిబ్బన్ కట్ చేసి ఈ ఆఫీస్ ను ఓపెన్ చేశారు. తొలిసారి నాని, అమితాబ్ కలుసుకున్నారు. ప్రశాంత్ నీల్ ను అమితాబ్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ కలిసి కొన్ని కీలక విషయాలు మాట్లాడుకున్నారు.

ఇలా ఎంతో కలర్ ఫుల్ గా సాగింది ఈ ఓపెనింగ్ ఈవెంట్. అందుకే వైజయంతీ మూవీస్ సంస్థ తమ ఛానెల్ లో వీడియో పెట్టగానే భారీ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. వీటికి సంబంధించిన క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

First Published:  29 Jun 2022 11:01 PM GMT
Next Story