Telugu Global
NEWS

నిర్మలా సీతారామన్ టంగ్ స్లిప్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

ట్విట్టర్‌లో చాలా యాక్టీవ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్.. అప్పుడప్పుడూ బీజేపీ నాయకులు చేసే తప్పులను ఎండగట్టడంలో ముందుంటారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ అంశంపై మీడియాతో మాట్లాడుతూ మాట జారడం (టంగ్ స్లిప్)పై కేటీఆర్ చాలా వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కొత్తగా పలు వస్తువులు, సేవలపై జీఎస్టీ విధించారు. వాటిని సీతారామన్ ప్రెస్ మీట్‌లో వివరించారు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌పై […]

నిర్మలా సీతారామన్ టంగ్ స్లిప్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
X

ట్విట్టర్‌లో చాలా యాక్టీవ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్.. అప్పుడప్పుడూ బీజేపీ నాయకులు చేసే తప్పులను ఎండగట్టడంలో ముందుంటారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ అంశంపై మీడియాతో మాట్లాడుతూ మాట జారడం (టంగ్ స్లిప్)పై కేటీఆర్ చాలా వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కొత్తగా పలు వస్తువులు, సేవలపై జీఎస్టీ విధించారు. వాటిని సీతారామన్ ప్రెస్ మీట్‌లో వివరించారు.

బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌పై జీఎస్టీ పెంచారు. అయితే హార్స్ రేసింగ్ అనబోయి ‘హార్స్ ట్రేడింగ్’ అని మాట్లాడి.. తర్వాత సరి చేసుకున్నారు. రాజకీయాల్లో కొనుగోళ్లను హార్స్ ట్రేడింగ్ అంటారు. ముఖ్యంగా ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడాన్ని హార్స్ ట్రేడింగ్ అంటూ పిలుస్తుంటారు. ప్రస్తుతం మహారాష్ట్ర సంక్షోభంలో కూడా శివసేన ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందంటూ అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ నోరు జారడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, టీఆర్ఎస్‌ నేత క్రిషాంత్ షేర్ చేసిన ఈ క్లిప్‌ను కేటీఆర్ రీట్వీట్ చేస్తూ.. ‘దీన్ని ఇంగ్లీషులో ఫ్రూడియన్ స్లిప్ ఆఫ్ టంగ్ అని అంటారు. హిందీలో మన్ కి బాత్ అంటారు’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ జోడించారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇలా అయితే బీజేపీనే ఎక్కువ పన్నులు కట్టాల్సి వస్తుందని.. సామాన్యులు అసలు పన్నులు కట్టాల్సిన అవసరమే ఉండదంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, హైదరాబాద్‌లో జూలై 2న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, 3న బహిరంగ సభ జరుగనుంది. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం జోరందుకుంది. సిటీ నిండా రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఫ్లెక్సీలతో టీఆర్ఎస్, ప్రధాని మోడీ ఫొటోలతో బీజేపీ నింపేసింది.

First Published:  30 Jun 2022 4:07 AM GMT
Next Story