Telugu Global
MOVIE UPDATES

అనంతపురంలో ది వారియర్ ట్రైలర్ లాంచ్..!

ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ ఆడియో విడుదల కార్యక్రమంతో మొదలయ్యేవి. ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్ తీరు మారింది. యూట్యూబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పాట చొప్పున యూట్యూబ్ వేదికగా విడుదల చేయడం జరుగుతోంది. సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసేందుకు కూడా పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా ఇటీవల విడుదలైన సినిమా విరాటపర్వం. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ […]

అనంతపురంలో ది వారియర్ ట్రైలర్ లాంచ్..!
X

ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ ఆడియో విడుదల కార్యక్రమంతో మొదలయ్యేవి. ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్ తీరు మారింది. యూట్యూబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పాట చొప్పున యూట్యూబ్ వేదికగా విడుదల చేయడం జరుగుతోంది.

సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసేందుకు కూడా పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.

రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా ఇటీవల విడుదలైన సినిమా విరాటపర్వం. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కర్నూలు నగరంలో జరిగింది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కూడా అంత గ్రాండ్ గా నిర్వహించడం అదే తొలిసారి. ఇప్పుడు మరోసారి అదే తరహాలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగనుంది.

రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా, తమిళ స్టార్ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం ది వారియర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన లిరికల్ సాంగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రేపు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు.

అయితే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో అనంతపురం నగరంలో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు.

ఇందుకు సంబంధించి అఫీషియల్ గా ఒక ప్రకటన కూడా చేశారు.శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అనంతపురం లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 7 గంటల 57 నిమిషాలకు ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హీరో రామ్, హీరోయిన్ కృతి శెట్టి ఇతర చిత్ర బృందం హాజరు కానుంది. కాగా ఈ సినిమా జూలై 14వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

First Published:  30 Jun 2022 2:47 AM GMT
Next Story