Telugu Global
National

గ‌వ‌ర్న‌ర్ల అధికారాల‌కు రాష్ట్రాల క‌త్తెర్లు!

నిష్ప‌క్ష‌పాతంగా, రాజ్యాంగ‌బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రించాల్సిన గ‌వ‌ర్న‌ర్లు ఒక్కోసారి ఆ దారి నుంచి ప‌క్క‌కు మ‌ళ్ళుతుంటారు. వారిని నియ‌మించిన పార్టీ మెప్పు కోస‌మో, ఆధిప‌త్యం చెలాయించాల‌న్న దుగ్ధో తెలియ‌దు కానీ త‌ర‌చూ వివాదాస్ప‌దం అవుతుంటారు. అందుకే రాష్ట్ర ముఖ్య‌మంత్రుల‌కు, గ‌వ‌ర్న‌ర్ల‌కు పొస‌గ‌డం లేదు. ఈ కార‌ణంగానే గ‌వ‌ర్న‌ర్ల అధికారాల‌కు క‌త్తెర వేయాల‌నే ఆలోచ‌న చేస్తున్నారు. ఆ దిశ‌గా తెలంగాణ‌, ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు,కేర‌ళ‌,మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్ర‌ధానంగా ముఖ్య‌మంత్రి సిఫార్సుల‌ను ఖాత‌రు చేయ‌క‌పోవ‌డం, ఉన్న‌త విద్యా సంస్థ‌లైన యూనివ‌ర్శిటీల‌లో […]

Governors
X

నిష్ప‌క్ష‌పాతంగా, రాజ్యాంగ‌బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రించాల్సిన గ‌వ‌ర్న‌ర్లు ఒక్కోసారి ఆ దారి నుంచి ప‌క్క‌కు మ‌ళ్ళుతుంటారు. వారిని నియ‌మించిన పార్టీ మెప్పు కోస‌మో, ఆధిప‌త్యం చెలాయించాల‌న్న దుగ్ధో తెలియ‌దు కానీ త‌ర‌చూ వివాదాస్ప‌దం అవుతుంటారు. అందుకే రాష్ట్ర ముఖ్య‌మంత్రుల‌కు, గ‌వ‌ర్న‌ర్ల‌కు పొస‌గ‌డం లేదు. ఈ కార‌ణంగానే గ‌వ‌ర్న‌ర్ల అధికారాల‌కు క‌త్తెర వేయాల‌నే ఆలోచ‌న చేస్తున్నారు. ఆ దిశ‌గా తెలంగాణ‌, ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు,కేర‌ళ‌,మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్ర‌ధానంగా ముఖ్య‌మంత్రి సిఫార్సుల‌ను ఖాత‌రు చేయ‌క‌పోవ‌డం, ఉన్న‌త విద్యా సంస్థ‌లైన యూనివ‌ర్శిటీల‌లో నియామ‌కాల విష‌యంలోనూ ముఖ్య‌మంత్రుల‌ మాటను లెక్క పెట్ట‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

తెలంగాణ‌…

ఇప్ప‌టికే ప‌లు విష‌యాల్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ తో ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై వివాదాస్ప‌ద‌మ‌వుతున్నారు. ఆమె ప‌లు సంద‌ర్భాల్లో ముఖ్య‌మంత్రి కేసిఆర్ సిఫార్సుల‌ను ప‌క్క‌న పెట్టిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. గ‌వ‌ర్న‌ర్ తీరుతో కేసిఆర్ అసంతృప్తితో ఉన్నారు. యూనివ‌ర్శ‌టీల నియామ‌కాల‌కు సంబంధించి గ‌వ‌ర్న‌ర్ అధికారాల‌కు క‌త్తెర వేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇదే విష‌య‌మై బెంగాల్, త‌మిళ‌నాడు, కేర‌ళ‌ ముఖ్యమంత్రులు కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

యూనివ‌ర్శిటీ ల్లో నియామ‌కాల‌ను కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ ద్వారా చేప‌ట్టాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని తెలిసింది. ఇందు కోసం ప్ర‌భుత్వం ఉన్నత విద్యామండలి చైర్మన్ నేతృత్వంలో కామన్ బోర్డు ఏర్పాటు చేసింది. ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న ఈ విధానాన్ని అమ‌లు చేయాలంటే చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాలి. దీనికి సంబంధించిన ముసాయిదాను కూడా సిఎం ఆమోదం కోసం పంపిన‌ట్టు తెలిసింది.

ప‌శ్చిమ బెంగాల్‌..

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్ క‌ర్ కు మ‌ద్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. 2019లో ధ‌న్ క‌ర్ గ‌వ‌ర్న‌ర్ గా బాద్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచీ సీఎం కూ ఆయ‌న‌కూ మ‌ధ్య వివాదాలు న‌డుస్తూనే ఉన్నాయి. గవర్నర్‌గా నియమితులైనప్పటి నుండి, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలనే ఉద్దేశంతోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

పౌరసత్వ (సవరణ) చట్టం-జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ ఆర్ సి) బిల్లులను మమత వ్యతిరేకిస్తూ గ‌వ‌ర్న‌ర్ ఎదుట నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డం, అది “రాజ్యాంగ విరుద్ధం” అని ఆయ‌న తీవ్రంగా స్పందిచ‌డం మొద‌లు 2021లో జరిగిన రాష్ట్ర ఎన్నికల తర్వాత త‌లెత్తిన ఘ‌ర్ష‌ణ‌లు, టిఎంసి కార్యకర్తలు త‌న‌పై దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపించ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ మ‌ద్య మ‌రింత దూరం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలనుకునే బిల్లులను అడ్డుకోవ‌డం వంటి చ‌ర్య‌ల‌తో ధన్‌ఖర్ మమతకు నిరంతర ముల్లులా త‌యార‌య్యార‌ని వినిస్తోంది.

ఇన్ని వివాదాల న‌డుమ రాష్ట్రంలోని ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌న్నింటికీ గ‌వ‌ర్న‌ర్ స్థానంలో ముఖ్య‌మంత్రే ఛాన్సెల‌ర్ గా ఉండేలా చ‌ట్టంలో మార్పులు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. అయితే దీనిని స‌హ‌జంగానే గ‌వ‌ర్న‌ర్ అడ్డుకుంటారు. దీంతో ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ ద్వారా త‌న పంతం నెగ్గించుకుంటుంది. ఇప్ప‌టికే ఉప్పు నిప్పులా ఉన్న సంబంధాలు దీంతో మ‌రింత క్షీణించ‌క త‌ప్ప‌దు.

ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఇదే తీరు ..

ఇక‌పోతే త‌మిళ‌నాడులో కూడా వైస్ ఛాన్సెల‌ర్ల నియామకాల‌ విష‌యంలో డిఎంకే ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ కు మ‌ద్య కూడా వివాదం నెల‌కొంది. ఈ యేడాది ఏప్రిల్ లో స్టాలిన్ ప్ర‌భుత్వం అసెంబ్లీలో ఒక బిల్లును ఆమోదించింది. ఈ సంద‌ర్భఃగా ముఖ్య‌మంత్రి స్టాలిన్ మాట్లాడుతూ..”ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్‌ను నియమించుకోలేకపోవడం వ‌ల్ల మొత్తం వర్సిటీ పరిపాలనలో చాలా సమస్యలకు కార‌ణ‌మ‌వుతుంది. ఇటీవలి కాలంలో గవర్నర్‌ నియామకాలు తన ‘ప్రత్యేక హక్కు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఉన్నత విద్యను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న వాస్తవాన్ని ఆయన గౌరవించడం లేదని” ఆయన అన్నారు.

వీసీల నియామకం విషయంలో కేరళ ప్రభుత్వం కూడా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌తో తలపడింది. తనకు బదులు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఉండాలని, అక్కడ జరుగుతున్న రాజకీయ నియామకాలతో ఎవరికీ ఇబ్బంది ఉండదని గత ఏడాది డిసెంబర్‌లో ఖాన్ చేసిన వ్యంగ్య ప్ర‌క‌ట‌న‌లు ప‌రిస్థితికి అద్దం ప‌ట్టాయి. గత సంవత్సరం, మహారాష్ట్రలోని శివసేన-కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్ర‌భుత్వం కూడా వీసీలను ఎంపిక చేసుకునే అధికారాన్ని రాష్ట్రానికి ఇచ్చేలా చ‌ర్య‌ల‌ను తీసుకుంది.
తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ వంటి అనేక ఇతర రాష్ట్రాలు కూడా వైస్‌ ఛాన్సెల‌ర్ల‌ను నియమించడానికి రాష్ట్రానికి అధికారం ఇచ్చేలా చట్టాలను రూపొందిస్తున్నాయి.

తాజాగా మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ సంక్షోభం నేప‌ధ్యంలో గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోషియారీ అసెంబ్లీ బ‌ల ప‌రీక్ష‌కు హ‌డావిడిగా ఆదేశాలిచ్చారు. బిజెపీ నాయ‌కులు ఢిల్లీలో మంత‌నాలు జ‌రిపి వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి బ‌ల‌రీక్ష‌కు ఏర్పాటు చేయాల‌ని కోరిన క‌ద్ది గంట‌ల్లోనే కోషియారీ నుంచి ఈ ఆదేశాలు వెళ్ళ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి ఎప్పుడెప్పుడు రావాలా అని ఎదురు చూస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ (బిజెపి)కి శివ‌సేన‌లో తిరుగుబాటు క‌లిసివ‌చ్చిన మంచి అవ‌కాశంగా క‌నిపించింది. అస‌లు ఈ తిరుగుబాటు అగ్గిని రాజేసిందే బిజెపి అనేవారు కూడా లేక‌పోలేదు. అది వేరే విష‌యం.

Next Story