Telugu Global
MOVIE UPDATES

కమర్షియల్ ట్రయిలర్ అదిరింది

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా కమర్షియల్ రేపు విడుదల కానుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పక్కా ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు, ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకున్నాయి. మేకర్స్ ప్రమోషనల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూల ద్వారా సినిమాను దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడీ ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు, స్టైలిష్ మాస్ కమర్షియల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ట్రైలర్‌లో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టార్ […]

కమర్షియల్ ట్రయిలర్ అదిరింది
X

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా కమర్షియల్ రేపు విడుదల కానుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పక్కా ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కించాడు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు, ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకున్నాయి. మేకర్స్ ప్రమోషనల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూల ద్వారా సినిమాను దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడీ ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు, స్టైలిష్ మాస్ కమర్షియల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

ట్రైలర్‌లో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టార్ కమెడియన్‌ల నుండి కామెడీ పంచ్‌లు ఉన్నాయి. వీటికితోడు ఇన్నాళ్లూ చూసిన పాత్రలకు కొత్త కోణాల్ని ఆవిష్కరించారు. మొదటి ట్రైలర్‌లో కాకుండా, సత్యరాజ్‌ను పాజిటివ్ క్యారెక్టర్‌గా చూసినప్పుడు, ఈ కొత్త ట్రైలర్‌లో అతన్ని మోసగాడుగా చూపించారు.

రాశి ఖన్నా కామిక్ టైమింగ్ కూడా ఆకట్టుకుంది. ఇక గోపీచంద్ తన స్టైలిష్ మాస్ యాంగిల్‌ని చూపించాడు. సినిమాలో కామెడీతో పాటు ఫుల్ యాక్షన్ ఉందని, తాజా ట్రయిలర్ లో ఎస్టాబ్లిష్ చేశారు.

యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్న పక్కా కమర్షియల్ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.

First Published:  29 Jun 2022 9:30 PM GMT
Next Story