Telugu Global
National

భారతీయ నగరాల్లో అత్య‌త ఖ‌రీదైన న‌గ‌రం ఏంటంటే..?

భార‌తీయ న‌గ‌రాల్లో అత్యంత ఖ‌రీదైన న‌గ‌రంగా ముంబై నిలిచింది. ప్ర‌పంచవ్యాప్తంగా ఖ‌రీదైన న‌గ‌రాల‌లో ముంబై 127 వ స్థానంలో ఉంది. సర్వేలో పాల్గొన్న ఇతర భారతీయ నగరాలు న్యూఢిల్లీ (155), చెన్నై (177), బెంగళూరు (178), హైదరాబాద్ (192), (201), కోల్‌కతా 203వ స్థానంలో నిలిచాయి. ర్యాంకింగ్‌లో కోల్‌కతా అత్యంత తక్కువ ఖర్చుతో గ‌డిపేయ‌గ‌ల న‌గరంగా తేలింది. ‘కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే-2022′ పేరుతో మెర్సెర్ ( Mercer) మార్చి నెల‌లో ఒక స‌ర్వే నిర్వ‌హించింది, జీవన […]

Indian-cities
X

భార‌తీయ న‌గ‌రాల్లో అత్యంత ఖ‌రీదైన న‌గ‌రంగా ముంబై నిలిచింది. ప్ర‌పంచవ్యాప్తంగా ఖ‌రీదైన న‌గ‌రాల‌లో ముంబై 127 వ స్థానంలో ఉంది. సర్వేలో పాల్గొన్న ఇతర భారతీయ నగరాలు న్యూఢిల్లీ (155), చెన్నై (177), బెంగళూరు (178), హైదరాబాద్ (192), (201), కోల్‌కతా 203వ స్థానంలో నిలిచాయి. ర్యాంకింగ్‌లో కోల్‌కతా అత్యంత తక్కువ ఖర్చుతో గ‌డిపేయ‌గ‌ల న‌గరంగా తేలింది.

‘కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే-2022′ పేరుతో మెర్సెర్ ( Mercer) మార్చి నెల‌లో ఒక స‌ర్వే నిర్వ‌హించింది, జీవన వ్యయాలు, వసతి ఖర్చులు రెండింటి పరంగా ముంబై భారతదేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా తేలింది.

ప్రపంచవ్యాప్తంగా 227 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ముంబై 127వ స్థానంలో నిలిచింది.
ప్ర‌పంచంలోని 227 నగరాల్లో గృహాలు, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదంతో సహా 200కు పైగా వస్తువుల ధరలను పోల్చింది.

మెర్సర్ ఈ సంవత్సరం తన’ కాస్ట్ ఆఫ్ లివింగ్ మెథడాలజీ’ని పునరుద్ధరించింది, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్ కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు వంటి కొత్త వస్తువులను కూడా ఈ స‌ర్వేలో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు.

రోజువారీ ఖర్చుల అంచ‌నా

రోజువారీ ఖర్చులకు అయ్యే అంశాలను అధ్యయనం హైలైట్ చేసింది. ఈ క్ర‌మంలో భారతీయ నగరాలలో ముంబై, ఢిల్లీ న‌గ‌రాల‌తో పోలిస్తే కోల్‌కతాలో పాలు, రొట్టెలు, కూరగాయలు మొదలైన రోజువారీ అవసరాలకు ప్ర‌జ‌లు అతి త‌క్కువ‌గా ఖ‌ర్చు చేస్తార‌ట‌.

ముంబై, ఢిల్లీల‌లో వీటికోసం ఎక్కువ ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంద‌ని స‌ర్వేలో తేలింది. ఇంధనం, ఫోన్ ఖర్చులు మొదలైన వాటి పరంగా, గృహ వినియోగాల ధర ముంబైలో అత్యధికంగా ఉండ‌గా, చెన్నై, హైదరాబాద్‌లలో త‌క్కువ‌గా ఉన్నాయి. ముంబైలో సినిమా చూడటం అత్యంత ఖరీదైనది అయితే హైదరాబాద్ అత్యంత చౌకైనది.

కోవిడ్ ప్ర‌భావంతో మార్కెట్ రూపురేఖ‌లు మారిపోయాయ‌ని, మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు కూడా త‌ముద్యోగుల‌కోసం ప్ర‌త్యేక చ‌ర్యు తీసుకోవ‌డం, ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తిలో మార్పులు చోటు చేసుకున్నాయ‌ని మెర్స‌ర్ కు చెందిన రాహుల్ శ‌ర్మ తెలిపారు

First Published:  30 Jun 2022 8:03 AM GMT
Next Story