Telugu Global
NEWS

కేటీఆర్ దెబ్బ అదుర్స్.. బీజేపీకి బిగ్ షాక్..

హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంది. ఊరూవాడా పోస్టర్లు వేస్తున్నారు, మోదీకోసం వంట వాళ్లకు అప్పుడే పని అప్పజెప్పారు, ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. కానీ టీఆర్ఎస్ మైండ్ గేమ్ కి బీజేపీ విలవిల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. సరిగ్గా కార్యవర్గ సమావేశాలకు రెండు రోజుల ముందు ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనన్ని స్థానాలు కైవసం చేసుకున్నామని ఆ మధ్య సంబరాలు చేసుకున్న […]

కేటీఆర్ దెబ్బ అదుర్స్.. బీజేపీకి బిగ్ షాక్..
X

హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంది. ఊరూవాడా పోస్టర్లు వేస్తున్నారు, మోదీకోసం వంట వాళ్లకు అప్పుడే పని అప్పజెప్పారు, ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. కానీ టీఆర్ఎస్ మైండ్ గేమ్ కి బీజేపీ విలవిల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. సరిగ్గా కార్యవర్గ సమావేశాలకు రెండు రోజుల ముందు ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనన్ని స్థానాలు కైవసం చేసుకున్నామని ఆ మధ్య సంబరాలు చేసుకున్న బీజేపీకి ఇది ఊహించని పరిణామమే. ఏకంగా నలుగురు కార్పొరేటర్లు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. తాండూరు మున్సిపాల్టీ బీజేపీ ఫ్లోర్ లీడర్ సైతం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

కేటీఆర్ సమక్షంలో గులాబి కండువా..
హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్.. టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో.. వీరంతా గులాబి కండువా కప్పుకున్నారు. పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీజేపీకి బిగ్ షాక్..
ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రత్యేక సమావేశమయ్యారు. భవిష్యత్తులో భాగ్యనగరంపై బీజేపీ జెండా ఎగరేయాలని వారికి సూచించారు మోదీ. మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోదీ హైదరాబాద్ వస్తున్నారు. నాయకులతో మరోసారి సమావేశం కాబోతున్నారు. ఈ దశలో.. తమ కార్పొరేటర్లు పార్టీ మారడం నిజంగా బీజేపీకి బిగ్ షాక్ అని చెప్పాలి. మా మీటింగ్ బ్యానర్లు కట్టుకోనీయడంలేదు, ఫ్లెక్సీలు వేసుకోనీయడం లేదు అంటూ.. బీజేపీ నేతలు ప్రచారం లెక్కలు చూసుకుంటుంటే.. టీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది.

First Published:  30 Jun 2022 10:11 AM GMT
Next Story