Telugu Global
NEWS

గూగుల్ ను అడిగితే తెలంగాణ గొప్పతనం తెలుస్తుంది -కేటీఆర్

తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఇటు ఆన్ లైన్ లోనూ అటు ఆన్ రోడ్ లోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉంటూ తన నియోజక వర్గమైన సిరిసిల్లా జనం సమస్యలు క్రమం తప్పకుండా పరిష్కరిస్తూ క్షణం తీరికలేకుండా గడిపే కేటీఆర్ సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టీవ్ గా ఉంటారు. దేశంలోని ప్రతి సమస్యపై ట్వీట్లు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటారు. ఈ రోజు ఆయన […]

గూగుల్ ను అడిగితే తెలంగాణ గొప్పతనం తెలుస్తుంది -కేటీఆర్
X

తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఇటు ఆన్ లైన్ లోనూ అటు ఆన్ రోడ్ లోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉంటూ తన నియోజక వర్గమైన సిరిసిల్లా జనం సమస్యలు క్రమం తప్పకుండా పరిష్కరిస్తూ క్షణం తీరికలేకుండా గడిపే కేటీఆర్ సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టీవ్ గా ఉంటారు. దేశంలోని ప్రతి సమస్యపై ట్వీట్లు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటారు. ఈ రోజు ఆయన తెలంగాణ గొప్పతనం గురించి ఓ ఆసక్తి కరమైన ట్వీట్ చేశారు.

తెలంగాణ గొప్ప‌త‌నం గురించి తెలుసుకోవాలంటే గూగుల్‌ను అడ‌గాల‌ని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు ఎక్క‌డ ఉంది? ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేట‌ర్ ఎక్క‌డ ఉంది? అని గూగుల్ ను అడగండి గూగుల్ మీకు తెలంగాణను చూయిస్తుంది అని ఆయన పోస్ట్ చేశారు. ఇవి తెలంగాణాలోనే ఉన్నందుకు, వీటిని కేసీఆర్ ప్రభుత్వమే నిర్మించినందుకు గర్వంగా ఉందని కేటీఆర్ తన ట్వీట్ లో రాశారు.

వ్య‌వ‌సాయం నుంచి ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ వ‌ర‌కు అన్ని రంగాల్లో తెలంగాణ అగ్ర‌భాగాన ఉందని కేటీఆర్ అన్నారు.

May be an image of 3 people

కాగా గూగుల్ లో సర్చ్ చేస్తే ప్ర‌పంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు కాళేశ్వరం అని, ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేట‌ర్ హైదరాబాద్ లో ఉందని గూగుల్ చూయిస్తోంది.

First Published:  30 Jun 2022 5:53 AM GMT
Next Story