Telugu Global
Sports

టీమ్ ఇండియా కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రా.. కపిల్ తర్వాత అతడే

భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రాను నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. టీమ్ ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నది. ఈ టూర్‌లో ఒక టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. గత ఏడాది కరోనా కారణంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చివరి టెస్టును వాయిదా వేశారు. ఇప్పుడు అదే టెస్టును జూలై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆ సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంతో ఉన్నది. […]

Jasprit Bumrah
X

భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రాను నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. టీమ్ ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నది. ఈ టూర్‌లో ఒక టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. గత ఏడాది కరోనా కారణంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో చివరి టెస్టును వాయిదా వేశారు.

ఇప్పుడు అదే టెస్టును జూలై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆ సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంతో ఉన్నది. ఈ మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్ భారత జట్టు వశం అవుతుంది.

ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా.. గత ఆదివారం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. అతను పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో టెస్టు మ్యాచ్‌కు దూరమ్యాడు. దీంతో టెస్టు జట్టు వైస్ కెప్టెన్ బుమ్రాకు ప్రమోషన్ ఇచ్చారు. ఏకైక టెస్టులో భారత జట్టును బుమ్రా నడిపించనున్నాడు. కపిల్ దేవ్ తర్వాత ఒక ఫాస్ట్ బౌలర్ భారత టెస్టు జట్టుకు కెప్టెన్ కావడం ఇదే తొలిసారి.

అలా బుమ్రా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను నియమించారు. కాగా, టీమ్ మేనేజ్‌మెంట్ పూర్తి జట్టును ఇంకా ప్రకటించలేదు. పరిమిత ఓవర్ల సిరీస్ కల్లా రోహిత్ తిరిగి జట్టులో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇక ఏకైక టెస్టుకు ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. న్యూజీలాండ్‌తో జరిగిన చివరి టెస్టులో ఆడని సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, వికెట్ కీపర్ శామ్ బిల్లింగ్స్ జట్టులోకి వచ్చారు. ఫామ్‌లో లేని జాక్ క్రాలీకి మరోసారి అవకాశం లభించింది. ఓలీ పోప్, జోరూట్, జానీ బెయిర్‌స్ట్రో, కెప్టెన్ బెన్ స్టోక్స్‌లతో జట్టు బలంగా కనపడుతున్నది. బౌలింగ్ విభాగంలో జాక్ లీచ్, బ్రాడ్, మాథ్యూ పోట్స్ ఉన్నారు.

ఇంగ్లాండ్ జట్టు: అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), మాథ్యూ పోట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్

First Published:  30 Jun 2022 10:55 AM GMT
Next Story