Telugu Global
MOVIE UPDATES

హ్యాపీ బర్త్ డే ట్రయిలర్ రివ్యూ

హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “హ్యాపీ బర్త్ డే“. ఈ సినిమాలోని సరికొత్త పాత్రలే కాదు, విభిన్నంగా చేస్తున్న ప్రమోషన్ కూడా మూవీ మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మత్తువదలరా ఫేమ్, దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నాడు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హ్యాపీ […]

హ్యాపీ బర్త్ డే ట్రయిలర్ రివ్యూ
X

హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “హ్యాపీ బర్త్ డే“. ఈ సినిమాలోని సరికొత్త పాత్రలే కాదు, విభిన్నంగా చేస్తున్న ప్రమోషన్ కూడా మూవీ మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మత్తువదలరా ఫేమ్, దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నాడు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా హ్యాపీ బర్త్ డే సినిమా జూలై 8న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రయిలర్, చూడగానే ఆకట్టుకునేలా ఉంది.

ఓ సీరియస్ సబ్జెక్టు కు కామెడీ టచ్ ఇస్తూ తీసిన సినిమా ఇది. సినిమాలో ఎక్కడ చూసినా గన్స్ కనిపిస్తుంటాయి. వాటిని జనాలు తమకు తోచినట్టు వాడుతుంటారు. అదే కామెడీని పండిస్తుంది. పైగా ట్రయిలర్ లో ఎవ్వరూ నవ్వరు, కానీ ఆ సీన్లు, డైలాగ్స్ చూస్తే అందరికీ నవ్వొస్తుంది. ఇలా ఓ డిఫరెంట్ సెటప్ తో ఈ సినిమా వస్తోంది.

కామెడీ, థ్రిల్లర్ కలిపి చేయడం కష్టం. ఒకటి ఎక్కువైతే ఇంకొటి తగ్గిపోతుంది. ట్రయిలర్ చూస్తే రితేష్ వాటిని బాగా కంబైన్ చేసి, బ్యాలెన్స్ చేసినట్టు కనిపిస్తోంది. బేసిగ్గా ఇది కామెడీ చిత్రం కాబట్టి ఇందులో లాజిక్స్ వెదక్కూడదు. లావణ్య త్రిపాఠి లుక్, యాక్టింగ్ బాగుంది. మిగతా ఆర్టిస్తులంతా డిఫరెంట్ గా కనిపిస్తూనే, డిఫరెంట్ గా నటించారు.

టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రిచ్ గా ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో, కామెడీ జానర్ లో 8వ తేదీన వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

First Published:  30 Jun 2022 12:01 AM GMT
Next Story