Telugu Global
MOVIE UPDATES

విషమస్థితిలో అభిమాని : ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్..!

జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రమాదానికి గురై విషమ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభిమాని కి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన జనార్దన్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఇటీవల జనార్దన్ ప్రమాదానికి గురై ప్రస్తుతం శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. అయితే తన అభిమాన హీరో ఎన్టీఆర్ తో ఒక్కసారైనా మాట్లాడాలని జనార్దన్ కోరిక. జనార్దన్ తల్లి […]

విషమస్థితిలో అభిమాని : ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్..!
X

జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రమాదానికి గురై విషమ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభిమాని కి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన జనార్దన్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఇటీవల జనార్దన్ ప్రమాదానికి గురై ప్రస్తుతం శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది.

అయితే తన అభిమాన హీరో ఎన్టీఆర్ తో ఒక్కసారైనా మాట్లాడాలని జనార్దన్ కోరిక. జనార్దన్ తల్లి ఈ విషయాన్ని అతని స్నేహితులకు తెలుపగా.. వారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఆ సంఘ నాయకులు విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం అభిమాన సంఘం నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకోగా ఎన్టీఆర్ ఫోన్ చేసి జనార్దన్ తో మాట్లాడారు.

‘నువ్వు త్వరగా కోలుకోవాలి. మా ముందుకు ఆనందంగా తిరిగి రావాలి. ఆ తరువాత నేను నిన్ను ప్రత్యేకంగా కలుస్తాను. అప్పటివరకు నువ్వు ఏ మాత్రం అధైర్యపడవద్దు’ అని ఎన్టీఆర్ అభిమానికి ధైర్యం చెప్పాడు. అభిమానితో మాట్లాడే సమయంలో ఎన్టీఆర్ కాస్త ఎమోషనల్ అయ్యారు.

జనార్దన్ తల్లితో కూడా ఎన్టీఆర్ మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభిమానికి ఫోన్ చేసి ఎన్టీఆర్ ధైర్యం చెప్పడంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.

First Published:  30 Jun 2022 2:11 AM GMT
Next Story