Telugu Global
NEWS

బటన్‌ నొక్కే ఆయనకే క్రెడిట్‌.. మాకేం లేదు- వైసీపీ ఎమ్మెల్యే

దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పెద్దల విధానాలు మారకుంటే వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పెరిగే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా ప్లీనరీలో మాట్లాడిన వేణుగోపాల్.. కార్యకర్తలు కూడా బయటకు రావడం లేదన్నారు. కార్యకర్తలకు రావాల్సిన బిల్లులే ఇప్పించలేదు.. మళ్లీ మీరు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే వాపోయారు. తాను ఎమ్మెల్యే అయిన కొత్తలో ప్రతి నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయల పనులు కేటాయించారని.. తాను అత్యుత్సాహంతో పార్టీ […]

బటన్‌ నొక్కే ఆయనకే క్రెడిట్‌.. మాకేం లేదు- వైసీపీ ఎమ్మెల్యే
X

దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పెద్దల విధానాలు మారకుంటే వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పెరిగే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా ప్లీనరీలో మాట్లాడిన వేణుగోపాల్.. కార్యకర్తలు కూడా బయటకు రావడం లేదన్నారు.

కార్యకర్తలకు రావాల్సిన బిల్లులే ఇప్పించలేదు.. మళ్లీ మీరు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే వాపోయారు. తాను ఎమ్మెల్యే అయిన కొత్తలో ప్రతి నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయల పనులు కేటాయించారని.. తాను అత్యుత్సాహంతో పార్టీ పెద్దల వద్దకు వెళ్లి మరో 20 కోట్ల రూపాయలు పనులు తెచ్చానని.. వాటిని చేసుకోవాల్సిందిగా కార్యకర్తలకు ఇచ్చానన్నారు. కానీ ఇప్పటికీ బిల్లులు రాలేదన్నారు. పనులు చేసిన వారంతా అప్పుల్లో కూరుకుపోయారన్నారు. ఒక విధంగా కార్యకర్తలను తానే అప్పుల ఊబిలోకి నెట్టేశానని ఆవేదన చెందారు.

ఇటీవల ఒక కార్యకర్త ఆరు నెలల నుంచి బయటకు రావడం లేదని.. ఆయన ఇంటికి తాను వెళ్తే.. అతడి భార్య బయటకు వచ్చి.. ”అయ్యా.. మీరు 25 లక్షల వర్క్ ఇప్పించారు. ఆ బిల్లులు ఇప్పటికీ రాలేదు. రెండేళ్లుగా మూడు రూపాయలతో వడ్డీ కట్టికట్టి చివరకు ఇల్లు అమ్మేసుకున్నాం. ఆయన బయట ముఖం చూపలేక ఇంట్లోనే ఉంటున్నారు. మాకేనా ఇలా చేసేది?” అంటూ బోరున ఏడ్చేసిందని ఎమ్మెల్యే వివరించారు. తన నియోజకవర్గంలోనే 100 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

గడప గడపకు వెళ్తే.. ఇవన్నీ సరేగానీ రోడ్లు ఎప్పుడు వేస్తారు?. నీళ్లు ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. గడప లోపల బాగుంది గానీ.. గడప బయట మాత్రం పరిస్థితి బాగోలేదన్నారు. నవరత్నాల పేరుతో సీఎం జగన్‌ బటన్ నొక్కడం వల్ల ఆయనకే నేరుగా క్రెడిట్ వెళ్తోంది గానీ.. ఎమ్మెల్యేలకు పేరు రావడం లేదన్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగాలంటే నాలుగు సీసీ రోడ్లు వేయాలి.. చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలి.. లేకుంటే ఎమ్మెల్యేల పరిస్థితి ఇంతే అంటూ వ్యాఖ్యానించారు. ప్లీనరీకి వచ్చిన పెద్దలు రోజూ సీఎంను కలుస్తుంటారు కాబట్టి ఈ విషయాలన్నీ తెలియజేయాలని ఎమ్మెల్యే వేణుగోపాల్ కోరారు.

పోలింగ్ రోజు పెద్ద యుద్దమే ఉంటుంది- సీ. రామచంద్రయ్య
వైసీపీ ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అంత సులువుగా ఏమీ ఉండదని, పరిస్థితి మనం అనుకున్నంత చక్కగా లేదని, వైసీపీ గెలుపు అంత సులభంగా ఉండదని.. పోలింగ్ రోజు పెద్ద యుద్ధమే జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాయచోటిలో జరిగిన అన్నమయ్య జిల్లా స్థాయి ప్లీనరీలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలన్నీ ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నాయని,వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఎంతో అవసమన్నారు. రాష్ట్రంలో ప్రజల కోర్కెలూ పెరిగిపోతున్నాయని, వాటిని ఎవరూ తీర్చలేరని సి. రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు.

First Published:  29 Jun 2022 8:15 PM GMT
Next Story