Telugu Global
National

మహారాష్ట్రకు మళ్ళీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ? రేపు ప్రమాణ స్వీకారం ?

మహారాజకీయ సంక్షోభానికి దాదాపు తెరపడినట్టే ! రెబెల్ సేన నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ కలిసి ఆడిన రాజకీయ చదరంగంలో సీఎం ఉద్ధవ్ థాక్రే ఓడిపోయారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సేన ఓటమి, బీజేపీ దూకుడు నాటి నుంచే మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, షిండే చకచకా పావులు కదిపారు. రాష్ట్రంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వాళ్ళు చేయని ప్రయత్నమంటూ లేదు.. షిండే తనవర్గం రెబెల్ ఎమ్మెల్యేలతో ముంబైని […]

మహారాష్ట్రకు మళ్ళీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ? రేపు ప్రమాణ స్వీకారం ?
X

మహారాజకీయ సంక్షోభానికి దాదాపు తెరపడినట్టే ! రెబెల్ సేన నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ కలిసి ఆడిన రాజకీయ చదరంగంలో సీఎం ఉద్ధవ్ థాక్రే ఓడిపోయారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సేన ఓటమి, బీజేపీ దూకుడు నాటి నుంచే మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, షిండే చకచకా పావులు కదిపారు. రాష్ట్రంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వాళ్ళు చేయని ప్రయత్నమంటూ లేదు.. షిండే తనవర్గం రెబెల్ ఎమ్మెల్యేలతో ముంబైని వీడి గౌహతికి చేరుకున్నప్పటి నుంచి మహా రాజకీయ సంక్షోభం రోజురోజుకీ మలుపులు తిరుగుతూ వచ్చింది.

చివరకు నిన్న క్లైమాక్స్ కి చేరుకుంది. సీఎం ఉద్ధవ్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు. ఆయన రాజీనామాను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆదేశించారు. తమకు 161 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ప్రకటించుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ మళ్ళీ మహారాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టవచ్చునని, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయవచ్చునని తెలుస్తోంది. అలాగే డిప్యూటీ సీఎంపదవి షిండేని వరించవచ్చునని అంటున్నారు.

ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన శిబిరంలో నైరాశ్యం అలముకోగా బీజేపీ, ఏక్ నాథ్ షిండే క్యాంపుల్లో సంతోషం ఉరకలెత్తుతోంది. కర్మ ఫలం అనుభవించక తప్పదని బీజేపీ నేత సి.టి. రవి .. థాక్రేనుద్దేశించి వ్యాఖ్యానించారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదన్నారు.

అధికారంలో లేకున్నా ప్రభుత్వాలను శాసించగలిగే వ్యక్తి బాలాసాహెబ్ థాక్రే కాగా..అధికారంలో ఉన్నప్పటికీ ఆయన కుమారుడు కనీసం తన పార్టీని కూడా కంట్రోల్ లో ఉంచుకోలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే థాక్రే ఎంతకు దిగజారిపోయారని బీజేపీ ఐటీ విభాగం ఇన్-ఛార్జ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ఇక షిండే వర్గం ఎమ్మెల్యేలతోను, ఇండిపెండెంట్ సభ్యుల మద్దతుతోను రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మద్దతుతో తాను అధికారాన్ని నిలబెట్టుకోవచ్ఛునని ఎంతగానో ఆశించిన థాక్రే ఆశయాలు వమ్మయ్యాయి.

తన మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రుల్లో మాజీ అయిన అనిల్ దేశ్ ముఖ్, మరో మంత్రి నవాబ్ మాలిక్ ల అవినీతిపై నోరు విప్పని ఉద్ధవ్ థాక్రే చివరకు ఇందుకు మూల్యం చెల్లించుకున్నారు. ఇక థాక్రే నివాసం వద్ద హనుమాన్ చాలీసా పఠనానికి అనుమతించనందుకు ఆయనకు ముఖ్యంగా అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ శాపనార్థాలు పెట్టారు.

తనను, తన భర్త ఎమ్మెల్యే రవి రానాను అరెస్టు చేసి జైల్లో పెట్టినందుకు ఆమె థాక్రేని దుయ్యబట్టారు. మీ నిరంకుశత్వానికి రోజులు దగ్గర పడతాయని ఆమె గత మే నెలలోనే హెచ్చరించారు. చూడబోతే ఇది కర్మ ఫలం మాదిరే ఉంది. షిండే రూపంలో థాక్రేని దెబ్బ కొట్టింది.

First Published:  29 Jun 2022 9:14 PM GMT
Next Story