Telugu Global
MOVIE UPDATES

విక్రమ్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడోచ్

ఈమధ్య కాలంలో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సినిమాల్లో విక్రమ్ ఒకటి. కమల్ విశ్వరూపానికి, లోకేష్ కనగరాజ్ టేకింగ్ తోడవ్వడంతో.. విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్టయింది. అంతర్జాతీ మార్కెట్లను కూడా ఆశ్చర్యపరిచింది. లోకేష్ కనగరాజ్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించారు. జూన్ 3 న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌గా విడుదలైన ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. కమల్ కు చాన్నాళ్ల తర్వాత ఓ బ్లాక్ బస్టర్ విజయాన్నందించింది. […]

విక్రమ్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడోచ్
X

ఈమధ్య కాలంలో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సినిమాల్లో విక్రమ్ ఒకటి. కమల్ విశ్వరూపానికి, లోకేష్ కనగరాజ్ టేకింగ్ తోడవ్వడంతో.. విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్టయింది. అంతర్జాతీ మార్కెట్లను కూడా ఆశ్చర్యపరిచింది.

లోకేష్ కనగరాజ్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించారు. జూన్ 3 న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌గా విడుదలైన ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. కమల్ కు చాన్నాళ్ల తర్వాత ఓ బ్లాక్ బస్టర్ విజయాన్నందించింది. ప్రత్యేకంగా ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ యాక్షన్ మూవీ, కోలీవుడ్ లో నంబర్-1 గ్రాసర్ గా నిలిచింది. తెలుగులో కూడా సూపర్ హిట్టయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

జూలై 8న డిస్నీ హాట్‌స్టార్‌లో విక్రమ్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. కమల్ నటవిశ్వరూపం, లోకేష్ అద్భుతమైన టేకింగ్, గిరీష్ గంగాధరన్ విజువల్స్, అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను 8వ తేదీ నుంచి ఇంట్లో ఆస్వాదించొచ్చు. ఈ సినిమా ఓటీటీలోకి వస్తే చూడాలని చాలామంది వెయిటింగ్. ఆ వెయిటింగ్ 8వ తేదీతో తీరనుంది.

డిస్నీ, హాట్ స్టార్ లో ఇప్పటివరకు సరైన సినిమా పడలేదు. అందుకే సౌత్ లో దానికి బేస్ ఏర్పడలేదు. ఇప్పుడీ సినిమాతో సౌత్ లో డిస్నీ హాట్ స్టార్ కూడా మంచి స్థానం సంపాదించబోతోంది.

First Published:  29 Jun 2022 9:01 AM GMT
Next Story