Telugu Global
NEWS

వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోండి -గవర్నర్ తమిళిసై

చదువే లోకంగా ఉండే విద్యార్థులు వివాహం విషయంలో వాయిదాల పర్వాన్ని ఆశ్రయించొద్దని సూచించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని, చదువుకోసం పెళ్లిని వాయిదా వేయొద్దని చెప్పారు. చదువు అయిపోయేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అన్న నిబంధన పెట్టుకోవద్దని అన్నారు. తాను కూడా చదువుకుంటుండగానే పెళ్లి చేసుకున్నానని, ఆ తర్వాత చదువు కొనసాగించానని, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి మార్కులతో పాసయ్యానని అన్నారు. భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలి అధునాతన […]

Tamilisai Soundararajan
X

చదువే లోకంగా ఉండే విద్యార్థులు వివాహం విషయంలో వాయిదాల పర్వాన్ని ఆశ్రయించొద్దని సూచించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని, చదువుకోసం పెళ్లిని వాయిదా వేయొద్దని చెప్పారు.

చదువు అయిపోయేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అన్న నిబంధన పెట్టుకోవద్దని అన్నారు. తాను కూడా చదువుకుంటుండగానే పెళ్లి చేసుకున్నానని, ఆ తర్వాత చదువు కొనసాగించానని, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి మార్కులతో పాసయ్యానని అన్నారు.

భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలి అధునాతన సింథటిక్ క్యాడవర్‌ తో కూడిన స్కిల్‌ ల్యాబ్, బర్తింగ్ సిమ్యులేటర్ ని గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగ ఆమె మెడికల్ స్టూడెంట్స్ తో సరదాగా మాట్లాడారు.

తాను మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే వివాహం చేసుకున్నానని చెప్పారు. పెళ్లి తర్వాత చదువుని అశ్రద్ధ చేయలేదని, అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులతో పాసయ్యాయని అన్నారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేయడం, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం, పీజీ పూర్తి చేయడం.. ఇలా ఒకదాని తర్వాత మరో లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ వివాహాన్ని పక్కనపెట్టొద్దని, వైద్య విద్యార్థులందరూ వయసులో ఉండగానే వివాహం చేసుకోవాలని సూచించారు తమిళిసై.

ఆరోగ్యం జాగ్రత్త..

కొందరు చదువు పేరుతో వివాహం ఆలస్యంగా చేసుకుని అనారోగ్యం పాలవుతున్నారని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వయసులో వివాహం చేసుకుంటేనే మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు.

ఉచిత వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎయిమ్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు గవర్నర్ తమిళిసై. ఆపరేషన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా సాధారణ ప్రసవాలు చేయాలని వైద్య విద్యార్థులకు ఆమె సూచించారు.

First Published:  29 Jun 2022 4:46 AM GMT
Next Story