Telugu Global
NEWS

ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నగదు మాయం

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలనుంచి సడన్ గా 800కోట్ల రూపాయలు మాయం అయ్యాయి. 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలనుంచి ఈ నగదు విత్ డ్రా అయినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు జీపీఎఫ్ స్లిప్ లు డౌన్ లోడ్ చేసి చూసుకుని షాకయ్యారు. కొంతమంది ఉద్యోగుల జీపీఎఫ్ అకౌంట్ నుంచి దాదాపు 80వేల రూపాయలు కూడా విత్ డ్రా అయినట్టు తెలుస్తోంది. జీపీఎఫ్ ఖాతాల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే అయినా.. గతంలో ఎప్పుడూ ఇలా విత్ డ్రా […]

ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నగదు మాయం
X

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలనుంచి సడన్ గా 800కోట్ల రూపాయలు మాయం అయ్యాయి. 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలనుంచి ఈ నగదు విత్ డ్రా అయినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు జీపీఎఫ్ స్లిప్ లు డౌన్ లోడ్ చేసి చూసుకుని షాకయ్యారు. కొంతమంది ఉద్యోగుల జీపీఎఫ్ అకౌంట్ నుంచి దాదాపు 80వేల రూపాయలు కూడా విత్ డ్రా అయినట్టు తెలుస్తోంది. జీపీఎఫ్ ఖాతాల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే అయినా.. గతంలో ఎప్పుడూ ఇలా విత్ డ్రా చేసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఒక్కసారిగా తమ ఖాతాలనుంచి నిధులు మాయం అయ్యాయని తెలిసే సరికి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలలో ఎంత సొమ్ము ఉందో తెలుస్తుంది కానీ, దాన్ని ఎప్పటికప్పుడు ఉద్యోగులు విత్ డ్రా చేసుకునే అవకాశం లేదు. అత్యవసరం అయితే కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. మిగతాదంతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో పదవీ విరమణ తర్వాత తీసుకుంటారు. ఈ క్రమంలో ఈ ఖాతాల నిర్వహణ, నిధుల వ్యవహారం అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఇటీవల కాలంలో నిధుల లేమి కారణంగా.. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము సకాలంలోవారి చేతికి అందడంలేదు. ఉద్యోగంలో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు కూడా జీపీఎఫ్ డబ్బు సకాలంలో సర్దుబాటు చేయలేకపోతున్నారు. అయితే ఉన్నట్టుండి ఇలా జీపీఎఫ్ సొమ్ము మాయం కావడంపై ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేయడాన్ని తప్పు పడుతూ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటున్నారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. గతంలో ఇదే తరహాలో డబ్బులు డ్రా అయిన సందర్భంలో తాము కేసులు పెట్టడానికి సిద్ధమయ్యామని, అప్పట్లో వెంటనే డబ్బులు తిరిగి జమ చేశారని, ఇప్పుడు మరోసారి తాము మోసపోయామని అంటున్నారాయన. తమ అనుమతి లేకుండా తమ ఖాతాలనుంచి డబ్బులు విత్ డ్రా చేయడం సరికాదంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు, న్యాయపోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. మార్చి నెలాఖరులోనే డబ్బులు విత్ డ్రా చేశారని, కానీ ఇప్పటి వరకు ఉద్యోగులకు సమాచారం ఇవ్వలేదని ఇది దొంగతనంతో సమానం అని ఆరోపిస్తున్నారు.

First Published:  28 Jun 2022 10:23 PM GMT
Next Story