Telugu Global
MOVIE UPDATES

మిస్ ఇండియా రేసు నుంచి తప్పుకున్న హీరోయిన్

మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు నెలల తరబడి సిద్ధమైంది. సినిమాలు తగ్గించుకోవడంతో పాటు మరెన్నో త్యాగాలు చేసింది. ఇష్టమైన వంటకాలు కూడా తినకుండా నోరు కట్టేసుకుంది. అలా ఎంతో శ్రమపడుతూ మిస్ ఇండియా పోటీలకు ప్రిపేర్ అవుతున్న రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్, ఇప్పుడు ఆ పోటీల నుంచి తప్పుకుంది. వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నప్పటికీ ఇది నిజం. తను మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా శివానీ ప్రకటించింది. రీసెంట్ గా ఆమె […]

మిస్ ఇండియా రేసు నుంచి తప్పుకున్న హీరోయిన్
X

మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు నెలల తరబడి సిద్ధమైంది. సినిమాలు తగ్గించుకోవడంతో పాటు మరెన్నో త్యాగాలు చేసింది. ఇష్టమైన వంటకాలు కూడా తినకుండా నోరు కట్టేసుకుంది. అలా ఎంతో శ్రమపడుతూ మిస్ ఇండియా పోటీలకు ప్రిపేర్ అవుతున్న రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్, ఇప్పుడు ఆ పోటీల నుంచి తప్పుకుంది.

వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్నప్పటికీ ఇది నిజం. తను మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నట్టు స్వయంగా శివానీ ప్రకటించింది. రీసెంట్ గా ఆమె మలేరియా బారిన పడిందంట. దాంతో చాలా గ్రూమిగ్ సెషన్స్, ట్రైనింగ్ సెషన్స్ మిస్సయిందంట. దీనికి తోడు మెడిసిన్ థియరీ పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలు కూడా ముంచుకొచ్చాయి.

దీంతో మిస్ ఇండియా పోటీలకు సమర్థవంతంగా ప్రిపేర్ అవ్వలేకపోయానని.. ఇలాంటి టైమ్ లో తప్పుకోవడమే ఉత్తమమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాధగా వెల్లడించింది శివానీ.

రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివానీ. ‘అద్బుతం’, ‘శేఖర్‌’ లాంటి చిత్రాల్లో నటించి ఓ మోస్తరుగా పేరు తెచ్చుకుంది శివానీ. ప్రస్తుతం జీ5కు ఓ వెబ్ సిరీస్ చేస్తోంది.

First Published:  29 Jun 2022 8:29 AM GMT
Next Story