Telugu Global
MOVIE UPDATES

అప్పుడు చెప్పాడు.. ఇప్పుడు చేసి చూపించాడు

ఈమధ్య హీరో శర్వానంద్ కాస్త బరువు పెరిగాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కాస్త బొద్దుగా కనిపించాడు. ఆ సినిమా ప్రమోషన్ టైమ్ లోనే తన ఫిజిక్ కు సంబంధించి ఓ శపథం చేశాడు ఈ హీరో. అర్జెంట్ గా బరువు తగ్గి, స్లిమ్ గా మారతానని, ఆ తర్వాతే కొత్త సినిమాలకు ఓకే చెబుతానని ప్రకటించాడు. అప్పుడు చెప్పింది ఇప్పుడు చేసి చూపించాడు శర్వ. అతడి కొత్త మేకోవర్ అదిరిపోయింది. ఎట్టకేలకు నటుడు శర్వానంద్ మేకోవర్ […]

అప్పుడు చెప్పాడు.. ఇప్పుడు చేసి చూపించాడు
X

ఈమధ్య హీరో శర్వానంద్ కాస్త బరువు పెరిగాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కాస్త బొద్దుగా కనిపించాడు. ఆ సినిమా ప్రమోషన్ టైమ్ లోనే తన ఫిజిక్ కు సంబంధించి ఓ శపథం చేశాడు ఈ హీరో. అర్జెంట్ గా బరువు తగ్గి, స్లిమ్ గా మారతానని, ఆ తర్వాతే కొత్త సినిమాలకు ఓకే చెబుతానని ప్రకటించాడు. అప్పుడు చెప్పింది ఇప్పుడు చేసి చూపించాడు శర్వ. అతడి కొత్త మేకోవర్ అదిరిపోయింది.

ఎట్టకేలకు నటుడు శర్వానంద్ మేకోవర్ అయ్యాడు. ప్రస్తుతం అతడు ఫిట్ గా కనిపిస్తున్నాడు. బొద్దుగా కనిపించినందుకు శర్వానంద్‌పై విమర్శలు వచ్చాయి. చాలా ఏళ్లుగా అతను ఫిట్‌గా లేడు. సినిమా తర్వాత సినిమా అతన్ని బొద్దుగా మార్చేసింది. రెండు ఫ్లాప్‌ల తర్వాత, అతను తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

నిర్ణయించుకున్న ప్రకారం.. షూటింగ్‌లకు విరామం ఇచ్చాడు. శారీరకంగా చాలా కష్టపడ్డాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కొత్త రూపాన్ని చూపించాడు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో శర్వానంద్ మిలియన్ ఫాలోవర్లను దాటాడు. దీనికి ధన్యవాదాలు చెప్పడంతో పాటు, తన లేటెస్ట్ ఫొటోను షేర్ చేశాడు.

ఫిట్ గా తయారవ్వడంతో, శర్వానంద్ ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టిపెట్టాడు. త్వరలోనే శర్వానంద్ నుంచి 2 కొత్త సినిమాల ప్రకటనలు రాబోతున్నాయి.

First Published:  29 Jun 2022 7:30 AM GMT
Next Story