Telugu Global
MOVIE UPDATES

జూలై 1న ది వారియర్ ట్రైలర్..!

యంగ్ హీరో రామ్ పోతినేని తొలిసారిగా ద్విభాషా చిత్రంలో నటించిన సినిమా ది వారియర్. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న సినిమా జూలై 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, లిరికల్ సాంగ్స్ అద్భుత స్పందన తెచ్చుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా […]

The Warriorr Movie
X

యంగ్ హీరో రామ్ పోతినేని తొలిసారిగా ద్విభాషా చిత్రంలో నటించిన సినిమా ది వారియర్. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న సినిమా జూలై 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, లిరికల్ సాంగ్స్ అద్భుత స్పందన తెచ్చుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని తాజాగా మేకర్స్ ఫిక్స్ చేశారు. జులై 1వ తేదీ రాత్రి 07. 57 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు.

ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. రామ్ తన కెరీర్లో తొలిసారి ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి మాస్ చిత్రాల తర్వాత మరోసారి రామ్ నుంచి మాస్ చిత్రం వస్తుండడంతో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రామ్ ఈ సినిమా తర్వాత మరోసారి మాస్ కథా చిత్రాన్నే చేస్తున్నాడు. టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను- రామ్ కాంబినేషన్ లో అతి త్వరలో సినిమా ప్రారంభం కానుంది.

First Published:  29 Jun 2022 1:44 AM GMT
Next Story