Telugu Global
MOVIE UPDATES

మహేష్ మువీ కోసం భారీ గ్రాఫిక్స్?

గ్రాఫిక్స్ లేకుండా సినిమా చేయలేదు రాజమౌళి. బాహుబలి-2 తర్వాత సింపుల్ గా సినిమా చేస్తానని, గ్రాఫిక్స్-సెట్స్ లాంటి భారీ హంగులకు పోనని చెప్పాడు రాజమౌళి. కానీ అలా చేయకుండా ఉండలేకపోయాడు. ఆర్ఆర్ఆర్ కోసం మరోసారి భారీ సెట్స్ వేశాడు, చాలా గ్రాఫిక్స్ వాడాడు. ఈసారి అలాంటి స్టేట్ మెంట్ ఇవ్వకుండానే తన పని స్టార్ట్ చేశాడు రాజమౌళి. మహేష్ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు రాజమౌళి. ఇందులో భాగంగా ఆయన పారిస్ సందర్శించాడు. ప్రపంచంలోనే ది బెస్ట్ […]

మహేష్ మువీ కోసం భారీ గ్రాఫిక్స్?
X

గ్రాఫిక్స్ లేకుండా సినిమా చేయలేదు రాజమౌళి. బాహుబలి-2 తర్వాత సింపుల్ గా సినిమా చేస్తానని, గ్రాఫిక్స్-సెట్స్ లాంటి భారీ హంగులకు పోనని చెప్పాడు రాజమౌళి. కానీ అలా చేయకుండా ఉండలేకపోయాడు. ఆర్ఆర్ఆర్ కోసం మరోసారి భారీ సెట్స్ వేశాడు, చాలా గ్రాఫిక్స్ వాడాడు. ఈసారి అలాంటి స్టేట్ మెంట్ ఇవ్వకుండానే తన పని స్టార్ట్ చేశాడు రాజమౌళి.

మహేష్ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు రాజమౌళి. ఇందులో భాగంగా ఆయన పారిస్ సందర్శించాడు. ప్రపంచంలోనే ది బెస్ట్ త్రీడీ స్టుడియోల్లో ఒకటైన యానిమేషన్ స్టుడియోలో సందర్శించాడు. మహేష్ మూవీ కోసమే రాజమౌళి, ఇలా యానిమేషన్ స్టుడీయోను సందర్శించాడనే టాక్ మొదలైంది.

మహేష్ మూవీకి సంబంధించి ఇప్పటివరకు కథ అనుకోలేదన్నాడు రాజమౌళి. కానీ అంతలోనే ఆయన ఇలా గ్రాఫిక్స్ స్టుడియోను సందర్శించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆల్రెడీ మహేష్-రాజమౌళి మధ్య కథాచర్చలు జరిగాయనే పుకార్లకు ఇది మరింత ఊతమిచ్చినట్టయింది. రాజమౌళితో పాటు కమల్ కన్నన్, నిర్మాత శోభు కూడా ఉన్నారు.

ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ తో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. వచ్చేనెలలో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇది పూర్తవ్వడానికి కనీసం ఏడాది పడుతుంది. ఈ ఏడాదిలో మహేష్ తో చేయాల్సిన సినిమాకు సంబంధించి కథ, స్క్రీన్ ప్లే, ప్రీ-ప్రొడక్షన్ లాంటి పనులు పూర్తి చేయబోతున్నాడు రాజమౌళి. 2023 చివరి నాటికి రాజమౌళి-మహేష్ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

First Published:  29 Jun 2022 1:18 AM GMT
Next Story