Telugu Global
NEWS

సాలు మోదీ… సంపకు మోదీ…హైదరాబాద్ లో ఫ్లెక్సీలు

హైదరాబాద్‌లో వచ్చే వారం జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల విజయం కోసం ఒకవైపు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా మరో వైపు ఆ పార్టీకి వ్యతిరేకంగా కూడా ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్ నగరంలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలపై ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు దర్శనమిస్తుండగా… మరో వైపు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాల ఫోటోలతో బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఇలా పోటా పోటీ ప్రచారం నడుస్తుండగానే సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోదీకి […]

సాలు మోదీ… సంపకు మోదీ…హైదరాబాద్ లో ఫ్లెక్సీలు
X

హైదరాబాద్‌లో వచ్చే వారం జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల విజయం కోసం ఒకవైపు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా మరో వైపు ఆ పార్టీకి వ్యతిరేకంగా కూడా ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్ నగరంలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలపై ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు దర్శనమిస్తుండగా… మరో వైపు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాల ఫోటోలతో బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఇలా పోటా పోటీ ప్రచారం నడుస్తుండగానే సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.

సాలు మోదీ…సంపకు మోదీ…అని రాసున్న ఫ్లెక్సీలలో బైబై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ప్రింట్ చేశారు. అంతేకాదు రైతు చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, నల్ల ధనం తెస్తానని చేసిన మోసం, నోట్ల రద్దు తదితర అంశాలను కూడా ఫ్లెక్సీలలో ప్రింట్ చేశారు.

పెరేడ్ గ్రౌండ్స్ చుట్టుపక్కల, టివోలీ థియేటర్ వద్ద ఈ ఫ్లెక్సీలు రాత్రికి రాత్రి వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీలను పెట్టిందెవరనే విషయంపై స్పష్టత లేదు. జూలై 3న పెరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బీజేపీ సభలో ప్రధాని మోడీ పాల్గొంటున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సాలు మోదీ.. సంపకు మోదీ.. ప్రధానికి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు

First Published:  29 Jun 2022 2:07 AM GMT
Next Story