Telugu Global
National

ఈ కేఫ్‌లో డబ్బులతో కాదు.. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆహారం కొనుక్కోవచ్చు

సాధారణంగా మనం ఏదైనా కేఫ్, రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ తిన్న తర్వాత బిల్ ఎలా చెల్లిస్తాం. కరెన్సీ, క్రెడిట్/డెబిట్ కార్డ్స్, డిజిట‌ల్ పే ద్వారా చెల్లిస్తుంటాం. డబ్బులు చెల్లించకుంటే ఏ రెస్టారెంట్ కూడా మనకు ఫ్రీగా నీళ్లు కూడా ఇవ్వదు. కానీ, గుజరాత్‌లోని జునాగడ్ పట్టణంలోని ఒక కేఫ్‌లో మాత్రం డబ్బులు లేకపోయినా హాయిగా తినేసి వెళ్లొచ్చు. అయితే ఆహార పదార్థాల కొనుగోలు కోసం ప్లాస్టిక్ వ్యర్థాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి సింగిల్ […]

ఈ కేఫ్‌లో డబ్బులతో కాదు.. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆహారం కొనుక్కోవచ్చు
X

సాధారణంగా మనం ఏదైనా కేఫ్, రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ తిన్న తర్వాత బిల్ ఎలా చెల్లిస్తాం. కరెన్సీ, క్రెడిట్/డెబిట్ కార్డ్స్, డిజిట‌ల్ పే ద్వారా చెల్లిస్తుంటాం. డబ్బులు చెల్లించకుంటే ఏ రెస్టారెంట్ కూడా మనకు ఫ్రీగా నీళ్లు కూడా ఇవ్వదు. కానీ, గుజరాత్‌లోని జునాగడ్ పట్టణంలోని ఒక కేఫ్‌లో మాత్రం డబ్బులు లేకపోయినా హాయిగా తినేసి వెళ్లొచ్చు. అయితే ఆహార పదార్థాల కొనుగోలు కోసం ప్లాస్టిక్ వ్యర్థాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో అన్ని సంస్థలు దానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. అదే సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వ అధికారులు అనేక వినూత్న పద్దతులను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో జునాగడ్ జిల్లా అధికారులు ఒక కేఫ్‌ను తెరిచారు. సర్వోదయ సఖి మండల్ అనే మహిళా గ్రూప్‌కు ఈ కేఫ్‌ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.

ఈ కేఫ్ ప్రత్యేకత ఏంటంటే..

ఇక్కడ బిల్‌ను ప్లాస్టిక్ వ్యర్థాల రూపంలో చెల్లించవచ్చు. అర కిలో ప్లాస్టిక్ ఇస్తే ఒక గ్లాసు నిమ్మరసం లేదా సోపు గింజల జ్యూస్ ఇస్తారు. ఒక కేజి ప్లాస్టిక్ వ్యర్థాలకు ప్లేట్ డోక్లా లేదా పోహ ఇస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాల బరువు పెరుగుతున్న కొద్దీ.. ఆ కేఫ్‌లో అనేక రకాల ఫుడ్ ఐటెమ్స్ ఫ్రీగా ఇస్తుంటారు.

ఇక ఇక్కడ ఆహార పదార్థాలు, జ్యూసులు అన్నీ మట్టి పాత్రల్లోనే సర్వ్ చేస్తారు. ఈ కేఫ్ ఏదో సాదా సీదాగా ఉండదు. అన్ని వెజ్ రెస్టారెంట్లో దొరికినట్లు గుజరాత్‌లోని ఫేమస్ ఐటెమ్స్ దొరుకుతాయి. బైంగన్ బర్తా, సేవ్ తమేటా, తెల్పా, బజ్రా రోట్లో వంటి గుజరాత్, కతియావాడి డిషెస్ లభిస్తాయి.

ఈ కేఫ్‌లో సేకరించిన వ్యర్థాలను ఒక ఏజెన్సీ కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ రచిత్ రాజ్ చెప్పారు. గ్రీన్ జునాగడ్‌లో భాగంగానే ఈ కేఫ్ ఏర్పాటు చేశామని.. ఇది విజయవంతం అయితే మరిన్ని కేఫ్‌లు తెరుస్తామని ఆయన చెప్పారు.

First Published:  29 Jun 2022 5:26 AM GMT
Next Story