Telugu Global
NEWS

లిక్కర్లో విషంలేదు.. ఏపీలో సరైన రేట్లు లేవు – లిక్కర్ అసోసియేషన్ వివరణ

ఏపీలో అమ్ముతున్న లిక్కర్ లో విష పదార్థాలు ఉన్నాయంటూ ఇటీవల టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి అంబటి రాంబాబు ఇదివరకే దీటుగా బదులిచ్చారు. టీడీపీ నేతల మెదళ్లే విషపూరితంగా మారాయని విమర్శించారు అంబటి. గతంలో చంద్రబాబు అనుమతి ఇచ్చిన డిస్టిలరీలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని, అప్పటి అమృతం ఇప్పుడు విషమైపోయిందా అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఏపీ లిక్కర్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. డిస్టిలరీలు సరఫరా చేసే […]

లిక్కర్లో విషంలేదు.. ఏపీలో సరైన రేట్లు లేవు – లిక్కర్ అసోసియేషన్ వివరణ
X

ఏపీలో అమ్ముతున్న లిక్కర్ లో విష పదార్థాలు ఉన్నాయంటూ ఇటీవల టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి అంబటి రాంబాబు ఇదివరకే దీటుగా బదులిచ్చారు. టీడీపీ నేతల మెదళ్లే విషపూరితంగా మారాయని విమర్శించారు అంబటి.

గతంలో చంద్రబాబు అనుమతి ఇచ్చిన డిస్టిలరీలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని, అప్పటి అమృతం ఇప్పుడు విషమైపోయిందా అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఏపీ లిక్కర్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. డిస్టిలరీలు సరఫరా చేసే లిక్కర్ లో విషం లేదని, ఎలాంటి సందేహాలున్నా తమని సంప్రదించవచ్చని చెప్పారు.

ఒక్కో కంపెనీనుంచి నాలుగైదు బ్రాండ్లు మార్కెట్లోకి వస్తుంటాయని, మూడు దశాబ్దాలుగా ఒక పద్దతి ప్రకారమే ఈ ప్రక్రియ నడుస్తోందని వివరణ ఇచ్చారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న వ్యాపారం కాబట్టి, తాము క్వాలిటీ లిక్కర్ నే సరఫరా చేస్తున్నామని, తయారీ నుంచి రవాణా వరకు ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని, లోపాలుంటే సరిచేసుకుంటామని, అంతే కాని లిక్కర్ విషం అంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు అసోసియేషన్ ప్రతినిధులు.

ఇక బ్రాండ్లు అందుబాటులో లేవంటూ చేస్తున్న ప్రచారంపై కూడా వారు స్పందించారు. ప్రజలు కోరుకునే బ్రాండ్లే అందుబాటులో ఉంచుతామని, డిమాండ్ లేని బ్రాండ్ మద్యం సరఫరా ఆపేస్తామని చెప్పారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఆయా బ్రాండ్లు సరఫరా చేస్తామన్నారు.

4 లక్షలమంది ఆధారపడి బతుకుతున్నాం..
లిక్కర్ పరిశ్రమ అంటే కేవలం యజమానులే కాదని, దీనిపై 4 లక్షలమంది ఆధారపడి బడుతుకున్నామని చెప్పారు లిక్కర్ అసోసియేషన్ ప్రతినిధులు. 184 బ్రాండ్ల తయారీమీద 4 లక్షలమంది ఆధారపడి జీవిస్తున్నామని చెప్పారు. అవసరమైతే డిస్టిలరీలను ఎవరైనా విజిట్ చేయొచ్చని, అంతే కాని విషపూరిత పదార్థాలతో లిక్కర్ తయారు చేస్తున్నారనే ప్రచారం ఆపాలని అంటున్నారు. విమ్టా ల్యాబ్ లిక్కర్ నాణ్యత పరిశీలించి సర్టిఫై చేస్తుందన్నారు.

ఏపీలో ధర తక్కువ..
ప్రస్తుతం ఏపీలో తక్కువ ధరకే మద్యం అందుబాటులో ఉందని, తెలంగాణలో రేట్లు ఎక్కువగా ఉన్నాయని. ప్రభుత్వం ఇస్తున్న ధరలు తమకు గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు వ్యాపారులు. ధరలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.

First Published:  29 Jun 2022 4:46 AM GMT
Next Story