Telugu Global
NEWS

దమ్ముంటే నాపై పోటీ చేయ్- కొడాలి నాని

గుడివాడలో తనను ఓడిస్తానని చంద్రబాబు అంటున్నారని.. కానీ తన బొచ్చు కూడా పీకలేరన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో వైసీపీ నియోజకవర్గస్థాయి ప్లీనరీ నిర్వహించారు. 2019లో చంద్రబాబును నమ్ముకుని వచ్చిన దత్తపుత్రుడిని రెండు చోట్ల, సొంత పుత్రుడిని మంగళగిరిలో చిత్తుచిత్తుగా జగన్ ఓడించారన్నారు. ఈసారి జగన్ ప్రభంజనంలో చంద్రబాబు కూడా కుప్పంలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. వైసీపీని ఓడిస్తామంటున్న మొనగాళ్లు ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదని కొడాలి ప్రశ్నించారు. 2004 నుంచి వరుసగా తాను గుడివాడలో గెలుస్తున్నానని […]

దమ్ముంటే నాపై పోటీ చేయ్- కొడాలి నాని
X

గుడివాడలో తనను ఓడిస్తానని చంద్రబాబు అంటున్నారని.. కానీ తన బొచ్చు కూడా పీకలేరన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో వైసీపీ నియోజకవర్గస్థాయి ప్లీనరీ నిర్వహించారు. 2019లో చంద్రబాబును నమ్ముకుని వచ్చిన దత్తపుత్రుడిని రెండు చోట్ల, సొంత పుత్రుడిని మంగళగిరిలో చిత్తుచిత్తుగా జగన్ ఓడించారన్నారు.

ఈసారి జగన్ ప్రభంజనంలో చంద్రబాబు కూడా కుప్పంలో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. వైసీపీని ఓడిస్తామంటున్న మొనగాళ్లు ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదని కొడాలి ప్రశ్నించారు.

2004 నుంచి వరుసగా తాను గుడివాడలో గెలుస్తున్నానని 2024లోనూ గెలిచి తీరుతానని కొడాలి ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడే పుట్టానని.. ఇక్కడే చనిపోతానన్నారు. ఇదే చంద్రబాబు పుట్టింది చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారి పల్లెలో అని గుర్తుచేశారు.

ఎన్టీఆర్‌ హయాంలో నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే మూడు సార్లు అక్కడ టీడీపీ గెలిచిందని.. అదే చంద్రబాబు పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఐదు సార్లు చంద్రగిరిలో ఎన్నికలు జరిగితే మూడు సార్లు కాంగ్రెస్‌, రెండుసార్లు వైసీపీ గెలిచిందని గుర్తు చేశారు. దీన్ని బట్టే చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలో ఉన్న బలం ఏపాటిదో టీడీపీ వారే అర్థం చేసుకోవాలన్నారు.

జగన్‌ చేస్తున్న అభివృద్ది చూసి సహించలేక నాలుగు మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుని.. నలుగురు వెధవలతో డిబేట్లు పెడుతున్నారని.. చర్చలు పెట్టే వాడు, చర్చల్లో పాల్గొనే వాడు ఇద్దరూ కూడా ఏపీలో ఉండరని విమర్శించారు.

కృష్ణా జిల్లాలో గౌడ కులస్తులకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత అప్పట్లో ఎన్టీఆర్‌కు, ఇప్పుడు జగన్‌కు మాత్రమే దక్కిందన్నారు. కృష్ణా జెడ్పీ చైర్మన్ పదవి ఓసీలకు వస్తే.. టీడీపీ హయాంలో మొగుడు గద్దె రామ్మోహన్‌ రావు ఎమ్మెల్యేగా ఉంటే ఆయన భార్య జెడ్పీ చైర్మన్‌గా ఉండేవారన్నారు. ఇప్పుడు ఓసీలకు వచ్చినప్పటికీ జెడ్పీ చైర్మన్ పదవిని బీసీలకు ఇచ్చిన వ్యక్తి జగన్‌ అని కొడాలి ప్రశంసించారు.

First Published:  28 Jun 2022 4:37 AM GMT
Next Story