Telugu Global
National

మహారాష్ట్రలో సీఎం ఉద్దవ్ థాక్రేకి ‘విషమ పరీక్ష’ !

మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ థాక్రే అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గౌహతి నుంచే చక్రం తిప్పుతున్న రెబెల్ సేన నేత ఏక్ నాథ్ షిండేకి, బీజేపీకి మధ్య ‘దూరం’ తగ్గుతున్న నేపథ్యంలో ఈ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్.. ఢిల్లీకివెళ్ళి పార్టీ హైకమాండ్ తో భేటీ కానున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో రెబెల్ సేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్న ఊహాగానాలు తలెత్తుతున్నాయి. పైగా తమ వర్గాన్ని అనర్హులుగా చేస్తూ డిప్యూటీ స్పీకర్ […]

Maharashtra CM Uddhav Thackeray
X

మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ థాక్రే అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గౌహతి నుంచే చక్రం తిప్పుతున్న రెబెల్ సేన నేత ఏక్ నాథ్ షిండేకి, బీజేపీకి మధ్య ‘దూరం’ తగ్గుతున్న నేపథ్యంలో ఈ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్.. ఢిల్లీకివెళ్ళి పార్టీ హైకమాండ్ తో భేటీ కానున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో రెబెల్ సేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్న ఊహాగానాలు తలెత్తుతున్నాయి.

పైగా తమ వర్గాన్ని అనర్హులుగా చేస్తూ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి జులై 11 వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించడంతో పరిస్థితి మెల్లగా షిండేకి అనుకూలంగా ఉంటోందా అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.

జులై 12 లోగా వీరు తమ సమాధానాలు ఇవ్వవచ్చునని కోర్టు పేర్కొంది. .. డిప్యూటీ స్పీకర్ కు, మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి, కేంద్రానికి, మరికొందరికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

అసెంబ్లీలో ఎలాంటి ఫ్లోర్ టెస్ట్ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరిన సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వ అభ్యర్థనపై తాత్కాలిక ఉత్తర్వులిచ్చేందుకు సైతం అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇది బాల్ థాక్రే హిందుత్వకు, ఆయన గురువు ఆనంద్ దీఘే సిధ్ధాంతాలకు, తమకు దక్కిన విజయమని ఏక్ నాథ్ షిండే అభివర్ణించారు.

పైగా గౌహతీలో షిండే క్యాంప్ బస చేసిన హోటల్ వద్ద షిండే, బాలాసాహెబ్ థాక్రే, ఆనంద్ దీఘేల పోస్టర్లను ఏర్పాటు చేశారు. రెబెల్ సభ్యుల చర్యలపై రోజురోజుకీ ఆగ్రహం పెంచుకుంటున్న ఉధ్దవ్ థాక్రే.. షిండే వర్గంలోని 9 మంది తిరుగుబాటు మంత్రులపై పై పగ తీర్చుకున్నారు. వారి శాఖలను ఇతరులకు కేటాయించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, రాజకీయ పరిస్థితి అస్థిరంగా ఉందని రాష్ట్ర బీజేపీ నేత ప్రవీణ్ దరేకర్ వ్యాఖ్యానించారు. ఈ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు అన్నట్టు ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీలో తాము మెజారిటీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, మహావికాస్ అఘాడీ ప్రభుత్వమే నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సుధీర్ ముంగంటివార్ అనే మరో బీజేపీ నేత అన్నారు. ఇలా ఉండగా ఈ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ రేపో, మాపో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారని సమాచారం.

అటు సీఎం థాక్రే మధ్యాహ్నం రెండున్నర గంటలకు అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. గౌహతిలో ఏక్ నాథ్ షిండే కూడా తమవర్గం వారితో మీటింగ్ పెట్టి భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకోనున్నారు. మరోవైపు తమ ఎమ్మెల్యేలంతా ముంబై చేరుకోవాలని బీజేపీ నాయకత్వం ఆదేశించింది. షిండే క్యాంపులో అప్పుడే మంత్రుల ‘నియామకాలు’ జరిగిపోయాయట.. ఫడ్నవీస్ సీఎం గా, షిండే డిప్యూటీ సీఎంగా ‘కొత్త కేబినెట్’ ఏర్పాటైనట్టు వార్తలు వస్తున్నాయి.

First Published:  28 Jun 2022 3:18 AM GMT
Next Story