Telugu Global
National

త్వరలో వీటి ధరలు కూడా పెరగబోతున్నాయి!

ఇటీవలి రోజుల్లో సామాన్యుడిపై ఆర్థిక భారం పెరిగింది. ఆర్ధిక సంక్షోభం కారణంగా పెట్రోల్ నుంచి వంట నూనెల వరకూ ఇప్పటికే అన్ని ధరలు మండిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరిన్ని వస్తువులు వచ్చి చేరుతున్నాయి. అవేంటంటే.. మాంధ్యం, యుద్ధం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు, ఎలక్ట్రానిక్‌ అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు పెరుగు, పనీర్, తేనె వంటి మరిన్ని వస్తువుల ధరలు పెరగనున్నట్టు నివేదికలు వస్తున్నాయి. బిజినెస్ స్టాండర్డ్ […]

త్వరలో వీటి ధరలు కూడా పెరగబోతున్నాయి!
X

ఇటీవలి రోజుల్లో సామాన్యుడిపై ఆర్థిక భారం పెరిగింది. ఆర్ధిక సంక్షోభం కారణంగా పెట్రోల్ నుంచి వంట నూనెల వరకూ ఇప్పటికే అన్ని ధరలు మండిపోతున్నాయి.

అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరిన్ని వస్తువులు వచ్చి చేరుతున్నాయి. అవేంటంటే.. మాంధ్యం, యుద్ధం కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు, ఎలక్ట్రానిక్‌ అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు పెరుగు, పనీర్, తేనె వంటి మరిన్ని వస్తువుల ధరలు పెరగనున్నట్టు నివేదికలు వస్తున్నాయి.

బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. జీయస్టీ(GST) కౌన్సిల్ సమావేశంలో కొన్ని ఉత్పత్తులపై మినహాయింపును తీసివేయడానికి నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీయస్టీ కౌన్సిల్ సమావేశం జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ కౌన్సిల్ 15 విషయాలపై మినహాయింపును రద్దు చేయచ్చు.

నివేదికల ప్రకారం రానున్న రోజుల్లో పెరుగు, లస్సీ, మజ్జిగ, జున్ను , తేనె, చేపలు, మాంసం, కొన్ని కూరగాయలు, బార్లీ, ఓట్స్ మొక్కజొన్న, మిల్లెట్స్, మొక్కజొన్న పిండి, బెల్లం, బొంగు బియ్యం, అటుకులు, ఎండు వరి లాంటి వస్తువులపై జీయస్టీ డిస్కౌంట్లు ముగుస్తాయి.

ఇకపోతే పెరుగు, లస్సీ, పఫ్డ్ రైస్ వంటి ప్రీ-ప్యాకేజ్డ్, లేబుల్ చేయబడిన వస్తువులకు కొంత జీయస్టీ కూడా విధించాలని కూడా ప్యానెల్ ఆలోచిస్తోంది. అలాగే ప్యాక్ చేసిన, లేబుల్ చేయబడిన వస్తువులపై జీయస్టీ అనేది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వ్యాపారం చేయడానికి వెసులుబాటుని అందిస్తుంది. ఇలాంటి ఉత్పత్తులకు జీయస్టీ మినహాయింపు కొనసాగవచ్చు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కూడిన జీయస్టీ కౌన్సిల్‌ 47వ సమావేశం జూన్‌ 28, 29 తేదీల్లో జరగనుంది. ఇందులో ఈ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

First Published:  28 Jun 2022 3:46 AM GMT
Next Story