Telugu Global
MOVIE UPDATES

అలాంటి రోల్స్ కోసం వెయిటింగ్

హీరోయిన్లంతా ఒక్కటే. ఒకే రకమైన మూస పాత్రలు పోషిస్తుంటారు. కానీ వీళ్లలో ఉన్నంతలో డిఫరెంట్ ఎవరంటే రాశిఖన్నా పేరు చెప్పాల్సిందే. ఈ ముద్దుగుమ్మ చేసే పాత్రలు కాస్త కొత్తగా ఉంటాయి. మరీ ముఖ్యంగా కామిక్ రోల్స్ చేసే హీరోయిన్ గా రాశిఖన్నాకు సెపరేట్ ఇమేజ్ ఉంది. ఆమె కోసం మేకర్స్ ప్రత్యేకంగా పాత్రలు సృష్టిస్తుంటారు. అయితే తను ఇంకా ఎక్కువ కోరుకుంటున్నానని తెలిపింది ఈ హీరోయిన్. బాహుబలిలో అనుష్క చేసిన వారియర్ ప్రిన్స్ లాంటి పాత్ర చేయాలని […]

అలాంటి రోల్స్ కోసం వెయిటింగ్
X

హీరోయిన్లంతా ఒక్కటే. ఒకే రకమైన మూస పాత్రలు పోషిస్తుంటారు. కానీ వీళ్లలో ఉన్నంతలో డిఫరెంట్ ఎవరంటే రాశిఖన్నా పేరు చెప్పాల్సిందే. ఈ ముద్దుగుమ్మ చేసే పాత్రలు కాస్త కొత్తగా ఉంటాయి. మరీ ముఖ్యంగా కామిక్ రోల్స్ చేసే హీరోయిన్ గా రాశిఖన్నాకు సెపరేట్ ఇమేజ్ ఉంది. ఆమె కోసం మేకర్స్ ప్రత్యేకంగా పాత్రలు సృష్టిస్తుంటారు. అయితే తను ఇంకా ఎక్కువ కోరుకుంటున్నానని తెలిపింది ఈ హీరోయిన్.

బాహుబలిలో అనుష్క చేసిన వారియర్ ప్రిన్స్ లాంటి పాత్ర చేయాలని ఉందట. ఇక మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ లో హీరోయిన్ చేసినటువంటి యాక్షన్ రోల్స్ కావాలంట. ఇక కథ మొత్తం తన చుట్టూరా తిరిగే హెవీ డోస్ ఎమోషనల్ పాత్ర చేయాలని ఉందట. ఇలా తన మనసులో కోరిక బయటపెట్టింది రాశిఖన్నా.

ప్రస్తుతం మిగతా హీరోయిన్ల కంటే భిన్నంగా కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీ.. త్వరలోనే తను కోరుకుంటున్న హెవీ రోల్స్ వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

పక్కా కమర్షియల్ సినిమాలో నటించింది రాశిఖన్నా. ఈ సినిమాలో సీరియల్స్ పిచ్చి ఉన్న కామిక్ రోల్ లో నటించింది. ఈ కథలో పాత్ర రాసుకున్నప్పుడే దర్శకుడు మారుతి తనను ఊహించుకున్నారని, అలా తనకోసం పుట్టిన పాత్రను తను పోషించానని అంటోంది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది పక్కా కమర్షియల్.

First Published:  28 Jun 2022 10:01 AM GMT
Next Story