Telugu Global
NEWS

50రోజుల వరకు ఓటీటీ వద్దు

తెలుగు చిత్ర పరిశ్రమను ఇటీవల రకరకాల భయాలు వెంటాడుతున్నాయి. ఓటీటీ కూడా అందులో ఒకటి. సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలోకి వచ్చేయడం, ఆ వెంటనే ఆన్‌లైన్‌లో హెచ్‌డీ నాణ్యతతో సదరు సినిమాలు ప్రత్యక్షం అవుతున్నాయి. దీని వల్ల థియేటర్లకు వచ్చే వారి సంఖ్య భారీగా పడిపోతోంది. థియేటర్‌కు వెళ్లి భారీగా చదివించుకోవడం కంటే కొద్దిరోజులు ఆగితే ఓటీటీలోకి వస్తుందన్న భావన ప్రేక్షకుల్లో పెరిగింది. దాంతో ఓటీటీ ప్రభావాన్ని నియంత్రించేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. సినిమాలను […]

50రోజుల వరకు ఓటీటీ వద్దు
X

తెలుగు చిత్ర పరిశ్రమను ఇటీవల రకరకాల భయాలు వెంటాడుతున్నాయి. ఓటీటీ కూడా అందులో ఒకటి. సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలోకి వచ్చేయడం, ఆ వెంటనే ఆన్‌లైన్‌లో హెచ్‌డీ నాణ్యతతో సదరు సినిమాలు ప్రత్యక్షం అవుతున్నాయి.

దీని వల్ల థియేటర్లకు వచ్చే వారి సంఖ్య భారీగా పడిపోతోంది. థియేటర్‌కు వెళ్లి భారీగా చదివించుకోవడం కంటే కొద్దిరోజులు ఆగితే ఓటీటీలోకి వస్తుందన్న భావన ప్రేక్షకుల్లో పెరిగింది.

దాంతో ఓటీటీ ప్రభావాన్ని నియంత్రించేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. సినిమాలను ఓటీటీలో విడుదల చేయడంపై బుధవారం నిర్మాతల సమావేశం జరగనుంది. ఈనేపథ్యంలో నిర్మాత బన్నీ వాసు ఓటీటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కొత్త సినిమా విడుదలైన తర్వాత కనీసం 50 రోజుల వరకు ఓటీటీకి ఇవ్వకూడదని నిర్మాతలు యోచిస్తున్నట్టు చెప్పారు. వెంటనే ఓటీటీలోకి రావడం వల్ల థియేటర్ల వ్యవస్థ దెబ్బతింటోందని, హీరోల క్రేజ్ కూడా తగ్గిపోయే అవకాశం ఉందన్నారు.

త్వరగా ఓటీటీలోకి సినిమాలు రావడం వల్ల పెద్ద హీరోలకు మరింత నష్టం ఉంటుందన్నారు. తన సినిమాలను 50 రోజుల వరకు ఓటీటీలో విడుదల చేయకుండా నిర్మాణ సంస్థలతో ఒక పెద్ద హీరో ఒప్పందం చేసుకున్నారని కూడా గుర్తుచేశారు.

మిగిలిన సినిమాల విషయంలోనూ అదే జరగాలన్నారు. ఫ్లాప్ అయిన సీనిమాను త్వరగా ఓటీటీలోకి తేవడం వల్ల అలాంటి సినిమాలకు లాభం కూడా ఉంటోందన్నారు. అసలు ఒక సినిమా విడుదలైన తర్వాత ఎన్ని రోజులకు ఓటీటీలో విడుదల చేయాలన్న దానిపై పరిశీలన చేస్తున్నట్టు వివరించారు. చిత్ర పరిశ్రమలో కోవిడ్ తర్వాత ఖర్చులు పెరిగాయని, వసూళ్లు మాత్రం తగ్గిపోయాయని వాసు వ్యాఖ్యానించారు.

First Published:  28 Jun 2022 5:26 AM GMT
Next Story